ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్‌ను గెలుస్తుందా? రోహిత్ శ‌ర్మకు షాక్

First Published | Nov 4, 2024, 9:25 AM IST

Team India : భారత జట్టు తన సొంత గడ్డ‌పై ఘోరంగా ఓడిపోయింది. స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్ ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ను గెలుస్తుందా? రోహిత్‌ శర్మ రియాక్షన్ ఏంటో తెలుసా?
 

Rohit Sharma, cricket

Team India: తన సొంతగ‌డ్డ‌పై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 3-0తో భార‌త్ వైట్ వాష్ అయింది. త‌న‌ను తీవ్రంగా నిరాశపరిచిన ఈ ఓటమిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో చెత్త దశగా అభివర్ణించాడు. టెస్టు సిరీస్ ఓటమికి రోహిత్ శర్మ పూర్తి బాధ్యత వహించాడు.

Rohit Sharma

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంత‌కుముందు పూణే, బెంగ‌ళూరుల‌లో జ‌రిగి టెస్టుల‌లో భార‌త్ ఓడిపోయింది. దీంతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో ఘోర పరాజయాన్ని భార‌త్ చవిచూసింది. చివ‌రి టెస్టులో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవ‌లం 121 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఒక్క రిష‌బ్ పంత్ మిన‌హా ఏ ప్లేయర్ కూడా పెద్దగా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. 

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందా?

న్యూజిలాండ్ తో ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ ఓడిపోయిన త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడుతూ నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు. త‌న కెరీర్ లోనే పెద్ద మ‌చ్చ‌గా అభివ‌ర్ణించాడు. 'ఈ రకమైన ప్రదర్శన నా కెరీర్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న.. ఈ ఓట‌మికి పూర్తి బాధ్యత వహిస్తాను. సొంతగడ్డపై ఇలాంటి టెస్టు సిరీస్‌ను కోల్పోవడాన్ని అంత ఈజీగా జీర్ణించుకోలేమ‌ని' రోహిత్ చెప్పాడు. 

Latest Videos


Rohit Sharma Test

రోహిత్‌ రియాక్షన్‌కి షాక్‌

అలాగే, రాబోయే భార‌త్ సిరీస్ ల‌ను కూడా ప్ర‌స్తావించాడు. ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అందులో విజిటింగ్ టీమ్ తన గత రెండు పర్యటనల్లో గెలిచింది. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో యువ బ్యాట్స్‌మెన్‌లకు ఇది ఎంత కష్టమని రోహిత్ శర్మను ప్రశ్నించగా 'ఇది చాలా సవాలుగా ఉంటుంది' అని చెప్పాడు.

'మేము దీని గురించి చాలా మాట్లాడతాము. సరైన మైండ్‌సెట్‌ను నిర్వహించడం సవాలుగా ఉంటుంది. యంగ్ ప్లేయ‌ర్ల‌తో పాటు అందిరికీ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ సవాలుగా ఉంటుంది. వారు ఎక్కడ ఆడుతున్నారో, ఎవరికి వ్యతిరేకంగా ఆడుతున్నారో భయపడకుండా సురక్షితంగా భావించే వాతావరణాన్ని మనం సృష్టించాలని' పేర్కొన్నాడు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త సహాయక సిబ్బందికి రోహిత్ శర్మ తన మద్దతును అందించాడు.  

రోహిత్, విరాట్ విఫలం

రోహిత్ శర్మ మాట్లాడుతూ 'కోచింగ్ సిబ్బంది బాగా ఉన్నారు. వారు ఇప్పుడే వచ్చారు. ఆటగాళ్ళు జట్లు ఎలా పని చేస్తారో వారు ఇప్పటికీ అర్థం చేసుకుంటారు. ఆటగాళ్లను ఇలాంటి ఒత్తిడి ప‌రిస్థితుల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేలా వారి స‌హ‌కారం ఉంటుంద‌ని' తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 91 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 93 పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఫల్యం కూడా కారణంగా చెప్ప‌వ‌చ్చు. 

'బ్యాట్స్‌మెన్ రాణించలేకపోతే, అది ఆందోళన కలిగించే విషయం. ఆటగాడిగా, కెప్టెన్‌గా, జట్టుగా అంద‌రితో క‌లిసి ముందుచూపుతో సాగాలి. ఇక్కడ సాధించలేకపోయిన దాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో చూడాలి. ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మాకు మంచి అవకాశం ఉంది. దీనిపై దృష్టి సారిస్తాం. మా బెస్ట్ ఇస్తాం' అని చెప్పాడు. 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి భారత్

స్వదేశంలో ఘోర పరాజయంతో భారత్ ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి కింద‌కు ప‌డిపోయింది. అయితే, రోహిత్ ఆస్ట్రేలియా టూర్‌లోని ఛాలెంజ్‌పై మాత్రమే దృష్టి పెట్టాల‌నుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు. 'మేము డబ్ల్యూటీసీ గురించి ఆలోచించడం లేదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు మించి ఆలోచించను. ఆస్ట్రేలియా సిరీస్ ఇప్పుడు మాకు చాలా ముఖ్యమైనది. దీని తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించకుండా సిరీస్‌పై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తామ‌ని' చెప్పాడు. 

'మా ఆటగాళ్లు చాలా మంది ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆడారు. అయితే, ప్ర‌స్తుత జ‌ట్టులో చాలా మంది ఆటగాళ్లు అక్కడ ఎక్కువ‌గా ఆడలేదు. అందుకే పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త ముందుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని' రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత్ గత రెండు సిరీస్‌లను గెలుచుకున్నదనీ, ఆ విజయాలతో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని రోహిత్ అన్నాడు. 'ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటం అంత సులభం కాదు, కానీ ఆస్ట్రేలియాలో గత రెండు సిరీస్‌లలో మేము ప్రదర్శించిన ఆట‌ తీరు నుండి మేము చాలా విశ్వాసాన్ని పొందగలము. మన మనస్సులో ఇలానే పాజిటివ్ ఉండాలి' అని తెలిపాడు.

click me!