Published : Dec 15, 2021, 12:01 PM ISTUpdated : Dec 15, 2021, 12:06 PM IST
BCCI: ఇద్దరు సారథుల మధ్య సయోధ్య కుదర్చడానికి బీసీసీఐ నడుం కట్టింది. వన్డే కెప్టెన్సీ వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతుండటంతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే....
టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి వైదొలగనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించిన దరిమిలా కోహ్లీ నొచ్చుకున్నాడని, కూతురు వామిక బర్త్ డే ను కారణంగా చూపి వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడానికి గాను విశ్రాంతి తీసుకోనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
27
ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఇప్పటివరకైతే కోహ్లీ నుంచి తమకు అందుకు సంబంధించిన విన్నపమేదీ రాలేదని బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి తెలిపాడు.
37
ప్రస్తుతానికైతే వన్డే సిరీస్ లో అతడు ఆడతాడని తాము భావిస్తున్నట్టు వివరించాడు. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కావల్సి ఉంది. జనవరి 19న తొలివన్డే, 21 న రెండో వన్డే, 23న మూడో వన్డే ఆడాల్సి ఉంది.
47
కాగా ఇదే విషయమై బీసీసీఐ అధికారి స్పందిస్తూ.. ‘వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్టు ఇప్పటివరకూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గానీ, కార్యదర్శి జై షా లకు గానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ కోహ్లీ సమాచారం అందిస్తే.. దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..
57
ప్రస్తుతానికైతే కోహ్లీ వన్డే సిరీస్ ఆడతాడనే భావిస్తున్నాం. ఆటగాళ్లంతా తమ కుటుంబాలతోనే దక్షిణాఫ్రికా బయల్దేరుతున్నారు అయితే బయో బబుల్ లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అప్పుడు బీసీసీఐకి సమాచారం అందించాల్సి ఉంటుంది..’ అని సదరు అధికారి తెలిపాడు.
67
ఇదిలాఉండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నది. దీనివల్ల జట్టు ప్రతిష్ట దెబ్బతింటుండటంతో బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారని తెలుస్తున్నది. ఈ మేరకు విరాట్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తున్నది. అనంతరం కోహ్లీ మనసు మార్చుకున్నట్టు.. వన్డేలకు అందుబాటులో ఉంటానని చెప్పినట్టు సమాచారం.
77
ఇదే జరిగితే రోహిత్ శర్మ సారథ్యంలో కోహ్లీ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఇద్దరు వెటరన్స్ మధ్య విభేదాలు ఎంత త్వరగా పరిష్కరిస్తే భారత క్రికెట్ కు అంతమంచిదని ఇండియన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కోహ్లీ నిజంగానే మనసు మార్చుకున్నాడా..? లేక అలక కొనసాగిస్తాడో తెలియాలంటే వన్డే సిరీస్ ప్రారంభం దాకా ఆగాల్సిందే.