రాహుల్‌పైనే భారం వేసిన టీమిండియా... రికార్డు ముంచుతాడో, నిలబెడతాడో...

Published : Jun 03, 2022, 05:09 PM IST

సఫారీ టూర్‌లో భారత జట్టు వైట్ వాష్ అయిన తర్వాత కూడా కెఎల్ రాహుల్ తిరిగి కెప్టెన్సీ దక్కించుకుంటాడని బహుశా అతను కూడా ఊహించి ఉండడేమో. ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ సాధించిన విజయాలు, తిరిగి అతనికి ఇంకో ఛాన్స్ ఇచ్చేలా చేశాయి...

PREV
18
రాహుల్‌పైనే భారం వేసిన టీమిండియా... రికార్డు ముంచుతాడో, నిలబెడతాడో...

విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లు ఉన్న సమయంలోనే సౌతాఫ్రికాలో ఒక్క వన్డే మ్యాచ్ గెలిపించలేకపోయిన కెఎల్ రాహుల్, ఇప్పుడు వారిపై ప్రతీకారం తీర్చుకోగలడా? అనేది పెద్ద అనుమానంగా మారింది...

28

విదేశాల్లో ఓడినట్టుగా స్వదేశంలో భారత్‌ని ఓడించడం తేలికయ్యే పని కాదు. అదీకాకుండా సౌతాఫ్రికాకి భారత పిచ్‌లపై పెద్దగా రికార్డు కూడా లేదు. గత పర్యటనలో టీమిండియా చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది సౌతాఫ్రికా...

38

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ప్రిపరేషన్‌లా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో భారత జట్టు ముందు ఓ రికార్డు ఎదురుచూస్తోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో స్వదేశంలో సిరీస్‌లు ఆడింది భారతజట్టు...

48

టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయాల తర్వాత స్వదేశంలో శ్రీలంక, వెస్టిండీస్, కివీస్ జట్లపై టీ20ల్లో గెలుస్తూ వచ్చిన భారత జట్టు, వరుసగా 12 విజయాలు అందుకుంది. 

58

సౌతాఫ్రికాతో జరిగే మొదటి టీ20 మ్యాచ్ గెలిస్తే వరుసగా 13 విజయాలు అందుకున్న మొదటి టీమ్‌గా నిలుస్తుంది భారత జట్టు... టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్, రొమానియా మాత్రమే 12 విజయాలతో టాప్‌లో ఉన్నాయి...
 

68

ఇప్పటికే సౌతాఫ్రికా వైట్ బాల్ కెప్టెన్ తెంబ భవుమా... ‘టీమిండియాని వరుసగా అత్యధిక టీ20 విజయాలు అందుకున్న జట్టుగా వరల్డ్ రికార్డు కొట్టకుండా చూస్తాం...’ అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు...

78

సౌతాఫ్రికా జట్టుకి కీలక ప్లేయర్లైన క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, కగిసో రబాడా, అన్రీచ్ నోకియా వంటి ప్లేయర్లు... రెండు నెలలుగా ఐపీఎల్ కోసం ఇండియాలోనే ఉంటూ ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు.

88

ఇప్పుడు కెప్టెన్సీ స్కిల్స్ లేవని విమర్శలు ఎదుర్కొంటున్న కెఎల్ రాహుల్‌కి ఇదే ఆఖరి అవకాశం కావచ్చు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో రాహుల్ తన ప్లేస్‌ని కాపాడుకోవాలంటే అలా ఇలా గెలవడం కాదు, సౌతాఫ్రికాని క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories