దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. యాషెస్ సిరీస్ కంటే భారత్ పాక్ మధ్య మ్యాచ్‌కే క్రేజ్ ఎక్కువ. అయితే ఇరు దేశాల మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి...
2013లో చివరిసారిగా భారత పర్యటనకు వచ్చింది పాకిస్తాన్. ఈ టూర్‌లో 2 టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడిన పాకిస్తాన్ జట్టు, 2007-08 సీజన్ తర్వాత టెస్టు సిరీస్ ఆడనేలేదు...
27
వన్డే వరల్డ్ కప్ 2019లో భారత జట్టు, పాకిస్తాన్‌ని చిత్తు చేస్తే... 2021 టీ20 వరల్డ్ కప్‌లో మొట్టమొదటిసారి భారత్‌పై విజయం అందుకుంది పాక్... మళ్లీ ఆసియా కప్ 2022 టోర్నీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది...
37
ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన రెండు నెలల గ్యాప్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం కూడా ఆశగా ఎదురుచూస్తోంది టీమిండియా...
47
‘భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు కలిసి ఆడాలని ఆశపడుతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయాల కారణంగా ఆడలేకపోతున్నారు. వాటిని ప్లేయర్లు కంట్రోల్ చేయలేరు కదా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్..
57
మహ్మద్ రిజ్వాన్, భారత సీనియర్ టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడారు..
67
‘పూజారాతో క్రికెట్ గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్లేయర్లుగా మా మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేవు... మాదంతా ఒకే క్రికెట్ కుటుంబం...
77
పూజారా చాలా మంచి వ్యక్తి. ఆయన అంకితభావం, ఫోకస్, ఏకాగ్రత అద్భుతం... యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలం, చే పూజారా... ముగ్గురూ నా దృష్టిలో టాప్ క్లాస్ ప్లేయర్లు...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ రిజ్వాన్...