ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి టీమిండియా సై... ఇప్పటిదాకా ఆలెన్ బోర్డర్- గవాస్కర్ సిరీస్‌ లెక్కలు ఇవి...

First Published Dec 15, 2020, 6:31 PM IST

వన్డే, టీ20 క్రికెట్ చూసేవారి సంఖ్య ఎక్కువైనా సంప్రదాయ క్రికెట్ టెస్టు ఫార్మాట్‌కి ఉండే ఆదరణ వేరు. టెస్టుల్లో ఉండే మజా వేరుగా ఉంటుంది. అందుకే నిజమైన క్రికెట్ ఫ్యాన్స్, టెస్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. మరి బోర్డర్- గవాస్కర్ టోర్నీలో ఇంతవరకూ క్రియేట్ అయిన రికార్డులు ఇవి...

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రం 5 వేల కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నారు... ఆ ఇద్దరూ భారత బ్యాట్స్‌మెన్లే.
undefined
సచిన్ టెండూల్కర్ 5493 బంతులను ఎదుర్కోగా, రాహుల్ ద్రావిడ్ 5432 బంతులు ఎదుర్కొని రెండో స్థానంలో నిలిచాడు...
undefined
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్ కూడా సచిన్ టెండూల్కర్. సచిన్ 13 సార్లు 50+ స్కోర్లు నమోదుచేశాడు.
undefined
రెండో స్థానంలో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, 12 సార్లు భారత జట్టుపై హాఫ్ సెంచరీకి పైగా స్కోర్లు చేశాడు.
undefined
ఆసీస్‌పై వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ 10 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు...
undefined
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
undefined
ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఆరు సెంచరీలు చేసిన విరాట్, మరో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు..
undefined
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్ మైకేల్ క్లార్క్. రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు మైకేల్ క్లార్క్...
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులతో రికీ పాంటింగ్ టాప్ స్కోరర్‌గా నిలవగా మూడో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో, నాలుగో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 141 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు..
undefined
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా ఐదుసార్లు హాఫ్ సెంచరీ, అంతకుమించి పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్, కెఎల్ రాహుల్...
undefined
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన వికెట్ కీపర్లు ముగ్గురు. ధోనీ రెండు సార్లు ఈ అవార్డు గెలవగా, గిల్‌క్రిస్ట్ ఓ సారి, మోంగియా ఓ సారి ఈ అవార్డు గెలిచారు.
undefined
బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక సార్లు డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్లు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, ఛతేశ్వర్ పూజారా. ముగ్గురూ రెండేసిసార్లు ఈ ఫీట్ సాధించారు...
undefined
సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ వేదికగా 2014లో ఈ ఫీట్ సాధించాడు విరాట్ కోహ్లీ..
undefined
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన ప్లేయర్లు ఇద్దరే. వీరేంద్ర సెహ్వాగ్, మైకేల్ క్లార్క్ ఈ ఫీట్ సాధించారు..
undefined
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో ఒకే మ్యాచులో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 4 బౌలర్లు భారతీయులే. హర్భజన్ సింగ్ ఒకే టెస్టులో 15 వికెట్లు తీయగా, జాసు పటేల్ 14, అనిల్ కుంబ్లే 13, హర్భజన్ సింగ్ మరో మ్యాచ్‌లో 13 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నారు.
undefined
బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ మూడు సార్లు ఈ అవార్డు గెలవగా, మరే ప్లేయర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు సిరీస్ అవార్డు గెలవలేకపోయారు.
undefined
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్. వార్నర్ 69 బంతుల్లో సెంచరీ బాదగా గిల్‌క్రిస్ట్ 84 బంతుల్లో శతకాన్ని పూర్తిచేసుకున్నాడు...
undefined
85 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉండగా కృష్ణమాచారి శ్రీకాంత్ 97 బంతుల్లో సెంచరీ బాది నాలుగో స్థానంలో ఉన్నాడు.
undefined
ఇప్పటిదాకా ఆస్ట్రేలియాలో జరిగిన ఆస్ట్రేలియా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 8 సార్లు గెలుచుకోగా... ఆస్ట్రేలియాకి ఐదుసార్లు టైటిల్ దక్కింది. 2003-04లో మాత్రం రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకున్నాయి....
undefined
click me!