ఆస్ట్రేలియాపై గెలిచి చూపిస్తాం... ఎలా గెలవాలో మాకు బాగా తెలుసు... - ఛతేశ్వర్ పూజారా...

First Published Nov 18, 2020, 1:06 PM IST

‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన ఇచ్చే టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు ఛతేశ్వర్ పూజారా. వన్డే, టీ20 జట్టులో చోటు దక్కపోయినా, భారతజట్టుకి టెస్టుల్లో దొరికిన ఆణిముత్యం పూజారా. గత పర్యటనలో ఆస్ట్రేలియాలో అదరగొట్టిన పూజారాకి, ఈ టూర్ కూడా చాలా కీలకం కానుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరిగిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్ ఆడలేదు ఛతేశ్వర్ పూజారా...
undefined
కరోనా లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత నేరుగా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడబోతున్నాడు పూజారా...
undefined
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానే వంటివారికి ఐపీఎల్ కారణంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కింది. అయితే పూజారా, హనుమ విహారి వంటివారికి ఆ ఛాన్స్ కూడా దక్కలేదు.
undefined
దీంతో ఈసారి ఆస్ట్రేలియాపై పూజారా పరుగులు చేయడం అంత ఈజీ కాదని ఆసీస్ మాజీ పేసర గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే...
undefined
అదీగాక డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి బ్యాట్స్‌మెన్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆసీస్ గడ్డమీద టీమిండియాకు పరాభవం తప్పదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు చాలామంది.
undefined
‘ఆస్ట్రేలియా లాంటి ఫారిన్ పిచ్‌ల మీద బ్యాటింగ్ అంత ఈజీ కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. గత సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది...
undefined
కానీ మన దగ్గర బెస్ట్ బౌలర్లు ఉన్నారు... బుమ్రా, షమీ, ఇషాంత్ వంటివాళ్లు ఇక్కడి పిచ్‌లపై ఆడినవాళ్లే... ఆస్ట్రేలియాలో ఎలా బౌలింగ్ చేయాలో వారికి బాగా తెలుసు’... అంటూ చెప్పుకొచ్చాడు ఛతేశ్వర్ పూజారా.
undefined
డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లో ఓ డే-నైట్ టెస్టు కూడా ఆబోతోంది టీమిండియా. ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడబోతున్న తొలి పింక్ బాల్ టెస్టు ఇదే...
undefined
ఇంతకుముందు ఒకే ఒక్క డే- నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది... అయితే బంగ్లాతో ఆడినట్టు ఆసీస్‌తో ఆడితే కుదరదు...
undefined
‘గత పర్యటనలో ఆడినట్టు ఆడితే మేం కచ్ఛితంగా గెలుస్తాం... ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా అవుట్ చేయాలో మా దగ్గర పక్కా ప్లాన్స్ ఉన్నాయి. వాటిని అమలు చేసి విజయం సాధిస్తాం. పింక్ బాల్‌తో ఆడడం కష్టమే.. కానీ డే-నైట్ టెస్టు కోసం ఎదురుచూస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు పూజారా.
undefined
2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించిన విరాట్ సేన... 2-1 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకుని సంచలనం క్రియేట్ చేసింది... అయితే ఆ సమయంలో స్టీవ్ స్మిత్, వార్నర్‌‌లు జట్టులో లేరు, బ్యాన్‌ పీరియడ్‌లో ఉన్నారు.
undefined
గత పర్యటనలో ఆస్ట్రేలియా గడ్డపై మూడు సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా... టెస్టు సిరీస్‌లో 500లకు పైగా పరుగులు చేసి అదరగొట్టాడు...
undefined
click me!