సీఎస్‌కేకి మ్యాచ్ విన్నర్ అయినప్పుడు, టీమిండియాకి కాలేడా... దీపక్ చాహార్‌‌ని సరిగా వాడుకోవాలంటూ...

Published : Sep 20, 2022, 04:08 PM ISTUpdated : Sep 20, 2022, 04:10 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఘోర పర్ఫామెన్స్ ఇచ్చింది. 14 మ్యాచుల్లో 10 పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. సీఎస్‌కే ఫెయిల్యూర్‌కి ప్రధానంగా వినిపించిన కారణం దీపక్ చాహార్ అందుబాటులో లేకపోవడం... అయితే దీపక్ చాహార్ అందుబాటులో ఉన్నా, అతన్ని సరిగ్గా వాడుకోవడం లేదు టీమిండియా...

PREV
17
సీఎస్‌కేకి మ్యాచ్ విన్నర్ అయినప్పుడు, టీమిండియాకి కాలేడా... దీపక్ చాహార్‌‌ని సరిగా వాడుకోవాలంటూ...
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు కూడా దీపక్ చాహార్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలను టీమ్‌కి సెలక్ట్ చేసిన బీసీసీఐ... దీపక్ చాహార్‌ని మాత్రం స్టాండ్‌బై ప్లేయర్‌గానే పెట్టింది...

27
Deepak Chahar

టీ20 వరల్డ్ కప్ తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు దీపక్ చాహార్. బంతితోనే కాకుండా బ్యాటుతోనూ రాణించగలనని నిరూపించుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ దీపక్ చాహార్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గానే చోటు దక్కింది...

37
Image Credit: Getty Images

దీనికి ప్రధాన కారణం గాయం కారణంగా దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు దీపక్ చాహార్. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన దీపక్, మొదటి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కలేదు..

47

ఆసియా కప్ 2022 టోర్నీకి కూడా స్టాండ్ బై ప్లేయర్‌గానే ఎంపికయ్యాడు దీపక్ చాహార్. ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి పట్టుమని 10 మ్యాచుల అనుభవం కూడా లేని యంగ్ ప్లేయర్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా దీపక్ చాహార్‌కి ఇవ్వలేదు టీమిండియా మేనేజ్‌మెంట్. చేతులు కాలిన తర్వాత తప్పు తెలుసుకుని, ఆవేశ్ ఖాన్‌ని తప్పించి దీపక్ చాహార్‌ని ఓ మ్యాచ్ ఆడించింది..

57

‘ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో దీపక్ చాహార్‌ని ఆడించాలి. దీపక్ ఏం చేయగలడో అందరికీ తెలుసు. అతనికి ఓ అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. గాయం తర్వాత పెద్దగా క్రికెట్ ఆడలేదు కాబట్టి అతనికి ఈ సిరీస్‌లో ఆడిస్తే టీమిండియాకి పర్ఫెక్ట్ ఆప్షన్‌గా మారతాడు...

67

ఆసియా కప్‌లో టీమిండియాకి వచ్చిన ప్రధాన సమస్య భువనేశ్వర్ కుమార్‌తో ప్రతీ మ్యాచ్‌లోనూ  4 ఓవర్లు వేయించాల్సి వచ్చింది. అదే మరో బౌలర్ అందుబాటులో ఉండి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. హార్ధిక్ పాండ్యా రూపంలో ఓ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నాడు.

77

అయితే బుమ్రా, హార్ధిక్ పాండ్యాలతో పాటు హర్షల్ పటేల్ కూడా కమ్‌బ్యాక్ ఇవ్వడం టీమిండియాకి మంచి పరిణామాలు. అయితే దీపక్ చాహార్‌ స్వింగ్ బౌలింగ్, ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా సెట్ అవుతుందని నా అభిప్రాయం. అతను ఐపీఎల్‌లో సీఎస్‌కే మ్యాచ్ విన్నర్ అయినప్పుడు టీమిండియాకి ఎందుకు కాలేడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం..  

click me!

Recommended Stories