విరాట్ కోహ్లీలాగే నాక్కూడా అన్యాయం జరిగింది... అమిత్ మిశ్రా షాకింగ్ కామెంట్స్...

First Published Dec 16, 2021, 4:11 PM IST

వన్డేల్లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీని అర్ధాంతరంగా ఆ పొజిషన్‌ నుంచి తప్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ అప్పగించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు బీసీసీఐ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు...

వన్డే కెప్టెన్‌గా అత్యధిక సగటుతో పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన వన్డే సారథిగానూ టాప్‌లో ఉన్నాడు...

ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సరైనది కాదని, ప్లేయర్లు కూడా ఇలాగే అద్భుతంగా రాణించిన తర్వాత జట్టుకి దూరమవుతున్నారని అంటున్నాడు భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా...

‘ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఇలా జరిగింది. టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడి, జట్టులో ప్లేస్ దక్కించుకున్నాక అద్భుతంగా రాణించిన తర్వాత చెప్పాపెట్టకుండా టీమ్‌లో నుంచి తీసేసేవాళ్లు...

టీమ్‌లో ప్లేస్ కోసం ఎన్నో కష్టాలను అనుభవించిన ప్లేయర్లకు, తమ పర్పామెన్స్ బాగున్నా ఎందుకని జట్టులో నుంచి తీసేశారో తెలియాల్సిన హక్కు ఉంది..

మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత కూడా జట్టులో నుంచి, ఆ పొజిషన్‌లో నుంచి ఎందుకు తీసేశారో తెలిస్తే, ఆ విభాగంలో మెరుగయ్యేందుకు దృష్టి పెట్టేందుకు అవకాశం దొరుకుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు అమిత్ మిశ్రా...

అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు, తన గురించి చేసినవేనని అతని రికార్డులు చూస్తే తెలుస్తుంది... 2016లో వన్డేల్లో న్యూజిలాండ్‌పై 5 మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన తర్వాత కూడా అమిత్ మిశ్రాకు మరో అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు...

అలాగే 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచులో 3 వికెట్లు తీసిన తర్వాత కూడా అమిత్ మిశ్రాను తీసి పక్కనబెట్టేశారు టీమిండియా సెలక్టర్లు...

39 ఏళ్ల అమిత్ మిశ్రా, భారత జట్టు తరుపున 22 టెస్టు మ్యాచులు ఆడి 76 వికెట్లు తీశాడు.  36 వన్డేల్లో 64 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 8 టీ20 14 వికెట్లు పడగొట్టాడు...

ఐపీఎల్‌లో 166 వికెట్లతో లసిత్ మలింగ (170 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్న అమిత్ మిశ్రాకి టీమిండియాలో తగినన్ని అవకాశాలు దక్కలేదు...

2003లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి రెగ్యూలర్ స్పిన్నర్ల కారణంగా భారత జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు..

39 ఏళ్ల వయసులోనూ రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 152 మ్యాచులు ఆడి 535 వికెట్లు తీశాడు. అతేకాకుండా 4176 పరుగులు కూడా చేశాడు...

click me!