సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్... ఆరెంజ్ ఆర్మీ క్యాంపులో డేల్ స్టెయిన్...

Published : Dec 16, 2021, 03:48 PM IST

డేవిడ్ వార్నర్‌, కేన్ విలియంసన్ వంటి స్టార్ ప్లేయర్లని ఐపీఎల్ 2022 వేలానికి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎట్టకేలకు అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్ తెలిపింది. సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు...

PREV
111
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్... ఆరెంజ్ ఆర్మీ క్యాంపులో డేల్ స్టెయిన్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన డేల్ స్టెయిన్, అంతకుముందు 2011-12 సీజన్లలో డెక్కన్ ఛార్జెర్స్, 2013-15 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు...

211

93 టెస్టుల్లో 439 వికెట్లు తీసిన డేల్ స్టెయినే్, 125 వన్డేల్లో 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20 మ్యాచుల్లో 64 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, 2021 ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..

311

2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి ఏదీ కలిసి రాలేదు. బౌలర్ టి నటరాజన్ గాయం కారణంగా దూరం కాగా, డేవిడ్ వార్నర్‌తో విభేదాల కారణంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌‌మెంట్...

411

ఫస్టాఫ్‌లో ఆరు మ్యాచులు ముగిసిన తర్వాత కేన్ విలియంసన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నా, ఆ మార్పు కూడా ఆరెంజ్ ఆర్మీకి విజయాలను అందించలేకపోయింది...

511

మొత్తంగా 14 మ్యాచుల్లో మూడంటే మూడు విజయాలు అందుకుని, 11 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 8 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శనను మూటకట్టుకుంది...

611

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీలో భాగంగా కెప్టెన్ కేన్ విలియంసన్‌ని అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, అతనితో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది...

711

డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, జానీ బెయిర్ స్టో వంటి స్టార్ ప్లేయర్లతో పాటు హెడ్ కోచ్ ట్రేవర్ బెలిస్ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడబోతున్నట్టు వార్తలు వచ్చాయి...

811

ట్రేవర్ బెలిస్ స్థానంలో టామ్ మూడీని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్‌ని నియమించేందుకు సంప్రదింపులు జరుపుతోంది...

911

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న వేళ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్ నియామకం జరిగితే, అది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌లో కాస్త జోష్ నింపే అవకాశం ఉంది...

1011

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌, వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారని జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి...

1111

అదే జరిగితే ఆర్‌సీబీ నుంచి డేల్ స్టెయిన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి వస్తే... ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా 2016లో టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్ ఇటు నుంచి అక్కడికి వెళ్లినట్టు అవుతుంది...

click me!

Recommended Stories