హ్యాట్రిక్ టైటిల్ గెలవాలంటే అది లేకుండా ఆడండి... ముంబైకి ప్రజ్ఞాన్ ఓజా సలహా...

First Published Apr 9, 2021, 4:36 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్. వరుసగా గత రెండు సీజన్లలో టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్, హ్యాట్రిక్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. అయితే వరుసగా మూడో టైటిల్ గెలవాలంటే, కాస్త జాగ్రత్తగా ఆడాలని సూచిస్తున్నాడు టీమిండియా మాజీ ప్లేయర్ ప్రజ్ఞాన్ ఓజా...

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడబోతోంది ముంబై ఇండియన్స్...
undefined
‘ముంబై ఇండియన్స్ జట్టు చాలా స్ట్రాంగ్ టీమ్... ఆల్‌రౌండర్లు, స్టార్ బ్యాట్స్‌మెన్, స్టార్ పేసర్లతో సమతూకంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్, టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..
undefined
రెండేళ్లుగా జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలో దిగుతున్న ముంబై ఇండియన్స్, మినీ వేలంలో పెద్దగా స్టార్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు...
undefined
కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ముంబై ఇండియన్స్‌కి లేదు. అయితే వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన ముంబై, 2021 సీజన్‌కి ముందు మంచి కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగుతోంది...
undefined
అయితే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవడంతో ముంబై ఇండియన్స్ ప్లేయర్లలో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు. వరుసగా హ్యాట్రిక్ టైటిల్ గెలవాలంటే మాత్రం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు’ అంటూ కామెంట్ చేశాడు ప్రజ్ఞాన్ ఓజా...
undefined
రోహిత్ శర్మ కెప్టెన్సీలో 8 సీజన్లు ఆడిన ముంబై ఇండియన్స్, ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పటిష్టమైన ముంబై జట్టును ఓడించాలంటే ఏ టీమ్ అయినా నూటికి రెండొందల శాతం ఇవ్వాల్సిందే...
undefined
2021 వేలంలో జేమ్స్ నీషమ్, మార్కో జాన్సేన్, పియూష్ చావ్లా, నాథన్ కౌంటర్‌నీల్, ఆడమ్ మిల్నే, అర్జున్ టెండూల్కర్, యుద్‌వీర్ చరక్‌లను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
undefined
పియూష్ చావ్లాను రూ.2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, మిగిలిన ప్లేయర్లను బేస్ ప్రైజ్‌కే కొనుగోలు చేయడం విశేషం...
undefined
click me!