ది ఓవల్‌లో టీమిండియాకి చెత్త రికార్డు... 13 టెస్టులు ఆడితే, గత 50 ఏళ్లలో భారత జట్టుకి...

First Published Aug 31, 2021, 1:09 PM IST

నాలుగో టెస్టు కోసం ఇప్పటికే లీడ్స్ నుంచి మళ్లీ లండన్ చేరుకున్నాయి ఇంగ్లాండ్, ఇండియా జట్లు. సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఇండియా- ఇంగ్లాండ్ నాలుగో టెస్టుకి వేదికనిచ్చే కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్‌కి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు...

నాటింగ్‌హమ్‌లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా... లార్డ్స్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టెస్టులో గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది...

అయితే హెడ్డింగ్‌లేలో జరిగిన మూడో టెస్టులో టీమిండియాను ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్‌ను 1-1తేడాతో సమం చేసింది...

దీంతో కెన్నింగ్టన్‌ ఓవల్‌లో జరిగే నాలుగో టెస్టు ఇరు జట్లకి కీలకం కానుంది. నాలుగో టెస్టు గెలిచిన జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదాన్ని తప్పించుకుంటున్నాడు. మాంచెస్టర్‌లో జరిగే టెస్టు ఓడినా సిరీస్ డ్రాగా ముగుస్తుంది...

నాలుగో టెస్టు గెలిస్తే మాంచెస్టర్ టెస్టుని డ్రా చేసుకున్నా 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఓవల్ టెస్టు సిరీస డిసైడర్‌గా మారనుంది...

అయితే ఇక్కడ టీమిండియాకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. ఇక్కడ ఇప్పటిదాకా 13 టెస్టు మ్యాచులు ఆడిన టీమిండియా, 5 మ్యాచుల్లో ఓడి, 7 మ్యాచులు డ్రా చేసుకుంది. ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది...

ఇప్పటిదాకా ఈ స్టేడియంలో 79 మ్యాచులు జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 38 సార్లు, తొలుత బౌలింగ్ చేసిన జట్లు 22 సార్లు గెలిచాయి... మిగిలిన 19 మ్యాచులు డ్రాగా ముగిశాయి...

గత 50 ఏళ్లలో ఇక్కడ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది టీమిండియా... 1971 నుంచి ఓవల్‌లో భారత్- ఇంగ్లాండ్ మధ్య 8 టెస్టులు జరగగా ఐదు మ్యాచులను డ్రా చేసుకున్న భారత జట్టు, మూడింట్లో ఓడింది..

2018లో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్‌కి వేదికనచ్చింది ది ఓవల్. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 118 పరుగుల తేడాతో ఓడింది. 

అయితే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 3, ఇషాంత్ శర్మ 3, హనుమ విహారి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టారు. 

464 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన టీమిండియా 345 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెఎల్ రాహుల్ 149, రిషబ్ పంత్ 114 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగిలిన ప్లేయర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో రహానే, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, పూజారా, హనుమ విహారి, షమీ డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ, రహానేలకు ఇక్కడ ఏ మాత్రం మంచి రికార్డు లేదు...

click me!