ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ, వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా చేరే రెండు అదనపు జట్లతో కలిసి 10 టీమ్‌లతో ఐపీఎల్ 2022 జరగబోతుంది...
2014 ఐపీఎల్ ఎడిషన్‌ను 10 జట్లతో నిర్వహించింది బీసీసీఐ. అయితే ఆ తర్వాత రెండు జట్లపై బ్యాన్ పడడంతో 8 జట్లతో రెగ్యూలర్‌గా ఐపీఎల్ సీజన్స్ కొనసాగాయి...
29
2022లో చేరే రెండు కొత్త జట్ల ద్వారా అదనంగా రూ.5 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది బీసీసీఐ... ఇందుకోసం భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది...
39
కొత్తగా చేరే ఒక్కో జట్టు బేస్ ప్రైజ్ కింద బీసీసీఐకి రూ.2 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బిడ్ వేసేందుకు ఒక్కో కంపెనీ రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...
49
‘ఏ కంపెనీ అయినా రూ.75 కోట్లు చెల్లించి, బిడ్ డాక్యుమెంట్ కొనుగోలు చేయొచ్చు. ఇంతకుముందు కొత్త టీమ్‌ల బేస్ ప్రైజ్ రూ.1700 కోట్లు ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని రూ.2 వేల కోట్లుగా నిర్ణయించాం..’ అంటూ తెలిపాడు ఓ బీసీసీఐ అధికారి...
59
ప్రస్తుతం గ్రూప్ మ్యాచులు, ప్లేఆఫ్స్, ఫైనల్‌తో కలిపి ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో మొత్తంగా 60 మ్యాచులు ఉంటాయి. వచ్చే సీజన్ నుంచి వీటి సంఖ్య 74కి చేరనుంది...
69
అయితే మరిన్ని రోజులు, మరిన్ని యాడ్స్, మరింత ఆదాయం... రాబట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లెక్కన ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయాలంటే, ఆ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించేదై ఉండాల్సిందే...
79
కొత్త జట్ల కోసం బిడ్స్ వేసే ప్రక్రియను సులభతరం చేస్తే మరింత ఆదాయం ఆర్జించవచ్చని గ్రహించిన బీసీసీఐ, బిడ్డింగ్ విధానంలో స్పల్ప మార్పులు చేసింది...
89
‘ఒకే కంపెనీ రూ.2 వేల కోట్ల బేస్ ప్రైజ్ చెల్లించాలంటే, అందరికీ వీలుకాకపోవచ్చు. అందుకే మూడు కంపెనీలు కలిసి ఒకే జట్టు కోసం బిడ్ వేసేందుకు అనుమతి ఇస్తున్నాం... ’ అంటూ తెలిపారు సదరు అధికారి...
99
అహ్మదాబాద్‌తో ఓ కొత్త జట్టు రావడం ఇప్పటికే అనధికారికంగా కన్ఫార్మ్ అయిపోగా లక్నో, పూణె, కొచ్చి పేర్లతో కొత్త జట్లు వస్తాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది...