రిషబ్ పంత్ ఉండి ఉంటేనా... నాథన్ లియాన్‌కి చుక్కలే! ఢిల్లీ టెస్టులో అతన్ని మిస్ అవుతున్న టీమిండియా...

Published : Feb 19, 2023, 09:33 AM ISTUpdated : Feb 19, 2023, 03:20 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ట్రోఫీలో టీమిండియా తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పర్యాటక టీమ్‌ని ఖంగుతినిపించిన భారత జట్టు, ఢిల్లీ టెస్టులో అదే జోరు చూపించలేకపోతోంది...

PREV
19
రిషబ్ పంత్ ఉండి ఉంటేనా... నాథన్ లియాన్‌కి చుక్కలే! ఢిల్లీ టెస్టులో అతన్ని మిస్ అవుతున్న టీమిండియా...
Rohit Sharma

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేసి ఆలౌట్ కాగా భారత జట్టు ఒక్క పరుగు తక్కువగా 262 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆ ఒక్క పరుగు ఆధిక్యం ఇంత పెద్ద తేడా తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది..

29
Nathan Lyon

ముఖ్యంగా ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ 5 వికెట్లు తీసి భారత టాపార్డర్‌ను కకావికలం చేశాడు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్.. వెంటవెంటనే లియాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు..

39

ఆ తర్వాత భారత యంగ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. భారత జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు నాథన్ లియాన్..
 

49
Rishabh Pant

అయితే రిషబ్ పంత్ ఉండి ఉంటే... నాథన్ లియాన్ పప్పులు ఉడికేవి కావు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో ఆస్ట్రేలియా సీనియర్ మోస్ట్ స్పిన్నర్‌ని భారత జూనియర్ వికెట్ కీపర్ ఓ ఆటాడుకున్నాడు...

59

నాథన్ లియాన్, రిషబ్ పంత్‌కి 347 బంతులు వేయగా ఇందులో 19 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 229 పరుగులు రాబట్టాడు భారత వికెట్ కీపర్. లియాన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడడానికి రిషబ్ పంత్‌కి మనసొప్పదు..
 

69

నాథన్ లియాన్ బౌలింగ్‌లో 64.6 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసే రిషబ్ పంత్, ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్‌కి చెమటలు పట్టించాడు. దిగ్గజ బ్యాటర్లకు చుక్కలు చూపించిన నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో ఈజీగా బౌండరీలు బాదుతుంటే ఏం చేయాలో తెలియక అతన్ని బౌలింగ్ నుంచి తప్పించాడు అప్పటి కెప్టెన్ టిమ్ పైన్..

79

అందుకే రిషబ్ పంత్ ఒక్కడూ టీమ్‌లో ఉండి ఉంటే, ఢిల్లీ టెస్టులో టీమిండియా ఆధిక్యం మరోలా ఉండేదని అంటున్నారు భారత అభిమానులు.. అదీకాకుండా ఢిల్లీ, రిషబ్ పంత్‌కి స్వంత ఊరు. కాబట్టి తనకు బాగా అచొచ్చిన మైదానంలో రిషబ్ పంత్, ఎలా చెలరేగిపోయేవాడో ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ట్విట్లు, మీమ్స్‌తో బాధపడుతున్నారు.. 
 

89
Rishabh Pant

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, మరో ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు. రిషబ్ పంత్ దూరం కావడంతో శ్రీకర్ భరత్‌కి అవకాశం కల్పించింది టీమిండియా.

99

 అంతర్జాతీయ అనుభవం లేని శ్రీకర్ భరత్, వికెట్ కీపింగ్‌లో ఆకట్టుకుంటున్నా... రిషబ్ పంత్‌ని మరిపించేలా పరుగులైతే చేయలేకపోతున్నాడు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫెయిల్ అయితే కెఎస్ భరత్ స్థానంలో మూడో టెస్టులో ఇషాన్ కిషన్‌ని ఆడించే అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories