టెస్టుల్లో టీమిండియా త్రిమూర్తులుగా అశ్విన్, అక్షర్, జడేజా... విరాట్, రోహిత్, పూజారా చేయలేని పని చేస్తూ...

Published : Feb 18, 2023, 03:51 PM IST

టెస్టుల్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కీ ప్లేయర్లు. ఈ సూపర్ సీనియర్లు చేసే స్కోరు బట్టే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తోంది వీళ్లు కాదు... రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా...

PREV
15
టెస్టుల్లో టీమిండియా త్రిమూర్తులుగా అశ్విన్, అక్షర్, జడేజా... విరాట్, రోహిత్, పూజారా చేయలేని పని చేస్తూ...

నాగ్‌పూర్ టెస్టులో టాపార్డర్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినా అతను అవుట్ అయ్యే సమయానికి టీమిండియా కేవలం 52 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. రోహిత్ అవుట్ అయ్యాక రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడం వల్లే భారత జట్టుకి 223 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది, ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయమూ వచ్చింది...

25
Image credit: PTI

2020 నుంచి రవీంద్ర జడేజా టెస్టుల్లో 40.79 సగటుతో 775 పరుగులు చేశాడు. 22.66 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా చేసిన ఈ పరుగులు... స్వల్ప స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినవే...
 

35
Image credit: PTI

రవిచంద్రన్ అశ్విన్ 2020 నుంచి టెస్టుల్లో 98 వికెట్లు తీశాడు. అంతేకాదు బ్యాటుతోనూ అదరగొట్టి 712 పరుగులు చేశాడు. ఈ రెండేళ్లలో ప్రపంచంలో ఏ ఆల్‌రౌండర్ క్రికెటర్ కూడా 90+ వికెట్లు తీసి, 500+ పరుగులు చేయలేదు.. 

45
Image credit: PTI

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. ఇప్పటికి 48 టెస్టు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, 32 సగటుతో 400లకు పైగా పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో రెండు సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు అక్షర్ పటేల్..

55
Ravindra Jadeja and Axar Patel

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్ బ్యాటర్లు టాపార్డర్‌లో ఫెయిల్ అవుతున్న చోట మిడిల్ ఆర్డర్‌లో బ్యాటుతో విలువైన పరుగులు చేయడమే కాకుండా బాల్‌తో వికెట్లు తీస్తూ... టీమిండియాకి వెన్నెముకగా, టెస్టుల్లో త్రిమూర్తులుగా మారిపోయారు అశ్విన్, అక్షర్ పటేల్, జడేజా..

click me!

Recommended Stories