ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం లండన్ ఫ్లైట్ ఎక్కేసింది టీమిండియా. జూన్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కొత్త జెర్సీలో కనిపించనుంది...
టీమిండియా కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ అర్ధాంతరంగా కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది బీసీసీఐ. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అడిడాస్ జెర్సీలో మొదటిసారి కనిపించనుంది టీమిండియా...
27
Team India
అయితే ఇదే టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. ఎందుకంటే జెర్సీ మారిన ప్రతీసారీ టీమిండియాకి పరాభవమే మిగిలింది. 2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు కొత్త జెర్సీతో ఇంగ్లాండ్‌కి వెళ్లింది భారత జట్టు...
37
గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది...
47
వంద కోట్ల టీమిండియా ఫ్యాన్స్ సౌండ్ వేవ్స్‌పై జెర్సీపై ముద్రించి, 2021 పొట్టి ప్రపంచకప్‌కి సాగనంపింది బీసీసీఐ. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా... నాకౌట్ స్టేజీకి కూడా అర్హత సాధించలేకపోయింది...
57
ఈ పరాభవం దెబ్బకు ఆ సౌండ్ వేవ్స్ జెర్సీ కొద్ది రోజులకే మాయమైంది. ఆ తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్‌కి కూడా కొత్త జెర్సీలోనే వెళ్లింది భారత జట్టు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది...
67
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు, గ్రూప్ స్టేజీలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది భారత జట్టు..
77
అడిడాస్ జెర్సీ, టీమిండియాకి మరోసారి పరాభవాన్ని మిగులుస్తుందా? కొత్త జెర్సీ సెంటిమెంట్‌ని దాటి టీమిండియాకి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అందిస్తుందా? అనేది మరోవారంలో తేలిపోనుంది..