శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రికార్డు భాగస్వామ్యం... వెంటవెంటనే మూడు వికెట్లు...

First Published Mar 28, 2021, 3:12 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు శుభారంభం దక్కింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నమోదుచేశారు. రోహిత్ శర్మ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా, శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలిసారి టీమిండియా తరుపున తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం దక్కింది... రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య వన్డేల్లో ఇది 17వ సెంచరీ భాగస్వామ్యం...
undefined
అత్యధిక సార్లు తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన రెండో భారత జోడిగా నిలిచారు రోహిత్- ధావన్... సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 21 సార్లు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసి టాప్‌లో ఉన్నారు...
undefined
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మధ్య 5 వేల పరుగుల భాగస్వామ్యం కూడా నమోదైంది. సచిన్ టెండూల్కర్, గంగూలీ కలిసి 8227 పరుగుల భాగస్వామ్యంతో టాప్‌లో ఉన్నారు.
undefined
మొదటి వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా... 37 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత 56 బంతుల్లో 10 ఫోర్లతో 67 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా అదిల్ రషీద్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ అవుట్ అయ్యాడు. 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా...
undefined
10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని, మొయిన్ ఆలీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 1030 వద్ద ఉన్న టీమిండియా 18 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది...
undefined
విరాట్ కోహ్లీని 9వ సారి అవుట్ చేసిన మొయిన్ ఆలీ, రెండుసార్లు బౌల్డ్ చేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేసి ఉంటే, అత్యంత వేగంగా స్వదేశంలో 5 వేల వన్డే పరుగులు పూర్తిచేసుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచేవాడు.
undefined
click me!