రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కాదు, అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం... పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్...

First Published May 21, 2021, 1:21 PM IST

పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పాక్ క్రికెట్ బోర్డుతో విబేధాల కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన అమీర్, ప్రస్తుతం ఐపీఎల్ 2022 ఆడేందుకు వీలుగా ఇంగ్లాండ్ పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

భారత జట్టు సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ప్రస్తుత తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. ఎలాంటి బౌలర్‌కైనా చుక్కలు చూపించగల ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల కంటే స్టీవ్ స్మిత్‌కి బౌలింగ్ చేయడమే తనకి కష్టంగా ఉండేందంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్...
undefined
‘నా వరకూ స్టీవ్ స్మిత్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే అతని టెక్నిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతను నిల్చుకునే యాంగిల్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అతను ఏ షాట్ ఆడతాడో గ్రహించడం కూడా చాలా కష్టం...
undefined
అవుట్ స్వింగర్ బంతి వేస్తే, అతను బ్యాట్ పైకి ఎత్తి వదిలేస్తాడు... ప్యాడ్ల పైకి బౌలింగ్ చేస్తే... ఓ సాలిడ్ షాట్స్‌తో దాన్ని బౌండరీ దాటిస్తాడు. అతనికి బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని టెక్నిక్ నాకు చాలా కొత్తగా అనిపించింది...
undefined
స్టీవ్ స్మిత్‌తో పోలిస్తే రోహిత్ శర్మకి బౌలింగ్ చేయడం చాలా తేలిక. రోహిత్ శర్మను అవుట్ చేయడానికి నాకు ఒకటికి రెండు మార్గాలు ఉన్నాయని అనిపించింది.
undefined
రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్‌తో వేసే ఇన్‌స్వింగర్లకు చాలా ఇబ్బంది పడతాడు. అలాగే వేగంగా వేసే బంతులను కూడా సరిగా ఎదుర్కోలేదు రోహిత్. రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది.
undefined
ఎలాంటి పరిస్థితుల్లో అయినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అలాంటి కోహ్లీని అవుట్ చేయడం చాలా కష్టం. లేకపోతే రోహిత్, విరాట్‌లకు బౌలింగ్ చేయడం చాలా తేలిక’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మహ్మద్ అమీర్...
undefined
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్ శర్మను డకౌట్ చేసిన మహ్మద్ అమీర్, విరాట్ కోహ్లీని 5 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. 21 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా అమీర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 65 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
undefined
click me!