ట్రెంట్ బౌల్ట్... వరల్డ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. వన్డే వరల్డ్ కప్ 2019, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ట్రెంట్ బౌల్ట్. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాలంటూ న్యూజిలాండ్ బోర్డును కోరి... క్రికెట్ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు ట్రెంట్ బౌల్ట్...
సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడంతో ట్రెంట్ బౌల్ట్, అంతర్జాతీయ మ్యాచులకు అందుబాటులో ఉండేది చాలా తక్కువ... న్యూజిలాండ్ ఆడే ప్రతీ మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉండదు...
27
Trent Boult
సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లకు వార్షిక వేతనంగా కోట్లలో పారితోషికం చెల్లిస్తాయి క్రికెట్ బోర్డులు. కాంట్రాక్ట్ లేని ప్లేయర్లు, కేవలం మ్యాచ్ ఫీజు మాత్రమే పొందుతారు. అంటే ఈ నిర్ణయం ద్వారా కొన్ని కోట్ల రూపాయలను వదులుకోవడానికి సిద్ధమయ్యాడు ట్రెంట్ బౌల్ట్..
37
బిజీ షెడ్యూల్ కారణంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు క్రికెటర్లు. టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ ఆడిన రెండు రోజులకే భారత్‌కి వచ్చి, టీమిండియాతో టీ20 సిరీస్ ఆడింది న్యూజిలాండ్...
47
బిజీ బిజీ క్రికెట్ కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ట్రెంట్ బౌల్ట్. ఇదే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ని భయపెడుతోంది...
57
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బీసీసీఐతో విభేదాలతో మరేదైనా కారణమో తెలీదు కానీ ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల కంటే ఆడకుండా రెస్ట్ తీసుకున్న మ్యాచులే ఎక్కువ...
67
ఇంగ్లాండ్ టూర్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, జింబాబ్వేతో టూర్ కూడా ఆడడం లేదు. కూతురు పుట్టిన తర్వాత ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు విరాట్ కోహ్లీ ఇష్టపడుతున్నాడు.. ఈ కారణంగానే అతని ఫోకస్ క్రికెట్ మీద నుంచి షిఫ్ట్ అయ్యిందనేది చాలామంది అభిప్రాయం...
77
ట్రెంట్ బౌల్ట్ స్ఫూర్తితో విరాట్ కోహ్లీ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటే..! ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఫ్యాన్స్‌ని కలవరబెడుతున్న ప్రశ్న, అనుమానం, భయం... ఇదే. అలా జరగకూడదని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు...