వెస్టిండీస్‌తోనే పట్టించుకోలేదు... జింబాబ్వేతో మ్యాచులు ఎవ్వరైనా చూస్తారా?..

Published : Aug 10, 2022, 03:56 PM IST

జనాల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేదు. కొన్నిసార్లు నెగిటివ్ టాక్ వచ్చినా సినిమాని సూపర్ హిట్ చేసే జనాలు, మరికొన్ని సార్లు ‘పాజిటివ్’ టాక్ వచ్చిన ‘అంటే సుందరానికి’ లాంటి సినిమాలను కూడా పట్టించుకోరు. దేన్నే ‘ఆఫ్ టైమ్’ అంటారు. అయితే సినిమాల విషయంలో ఆ ఆఫ్ టైమ్, గత శుక్రవారం బ్రేక్ అయ్యింది... చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్‌ దగ్గర రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశాయి. మరి క్రికెట్ సంగతేంటి?...

PREV
19
వెస్టిండీస్‌తోనే పట్టించుకోలేదు... జింబాబ్వేతో మ్యాచులు ఎవ్వరైనా చూస్తారా?..
Image credit: PTI

బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్‌చరణ్ ఫ్యాన్స్, మరో పక్క సినీ లవర్స్... ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టడంతో 10 ఫ్రాంఛైజీల ఐపీఎల్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు...

29
Mumbai Indians

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఫెయిల్యూర్‌తో అట్టర్ ఫ్లాప్ కావడంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆశించిన టీఆర్పీ రాలేదు. బీసీసీఐ ఆశించిన వ్యూయర్‌షిప్‌లో దాదాపు 40 శాతం పడిపోయిందని అంచనా..

39

ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి కాస్త పర్వాలేదనే టీఆర్పీయే దక్కింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని పెద్దగా పట్టించుకోని క్రికెట్ ఫ్యాన్స్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌ని ఆదరించారు...

49

నిర్ణయాత్మక ఐదో టెస్టుకి మంచి రేటింగ్ రాగా... ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి మంచి టీఆర్పీ దక్కింది. అయితే వన్డే సిరీస్ మళ్లీ అట్టర్‌ఫ్లాప్‌గా మారింది... మూడు వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా 50 ఓవర్ల పాటు సాగకపోవడంతో ఆ సిరీస్‌ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.

59

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లైతే క్రికెట్ ఫ్యాన్స్‌ పట్టించుకున్న పాపాన పోలేదు... అక్కడి టైమింగ్‌కీ, ఇక్కడ టైమింగ్‌కీ పొంతన లేకపోవడంతో అర్దరాత్రి సాగిన మ్యాచులకు ఏ మాత్రం ఆదరణ దక్కలేదు...

69

ఇప్పుడు జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. ఈ సిరీస్‌కి కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్లు అందరూ దూరంగా ఉంటున్నారు...

79
Image credit: Getty

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులనే చూడని జనాలు, జింబాబ్వేతో మ్యాచులంటే చూస్తారా? అనేది బీసీసీఐని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే వెస్టిండీస్‌ సిరీస్‌తో పోలిస్తే... జింబాబ్వే సిరీస్‌కి కొన్ని పరిస్థితులు అనుకూలిస్తున్నాయి...

89

వెస్టిండీస్‌తో సిరీస్‌ మ్యాచులు డీడీ స్పోర్ట్స్‌లో మినహా ఎక్కడా ప్రసారం కాలేదు. జింబాబ్వే టూర్‌లో భారత జట్టు ఆడే మ్యాచులు సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యేక్షం ప్రసారం కాబోతున్నాయి. అయితే జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లలో ఫ్రీగా మ్యాచులను చూసే అవకాశం ఉంది...

99
TEA

అదీకాకుండా ఈ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారం కాబోతున్నాయి. దీంతో వెస్టిండీస్‌తో సిరీస్‌తో పోలిస్తే జింబాబ్వే మ్యాచులకు కాస్తో కూస్తో టీఆర్పీ రావచ్చని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

click me!

Recommended Stories