Published : Sep 02, 2023, 06:08 PM ISTUpdated : Sep 02, 2023, 08:20 PM IST
12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతోంది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆసియా కప్ 2023 టోర్నీలో మొదటి మ్యాచ్‌లో అలాంటి ఆశలు పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చేసింది టీమిండియా...
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టే రోహిత్ శర్మ, ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయ్యేవాడు. 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రోహిత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఇంకాస్త ఇంప్రూమెంట్ చూపిస్తూ, ఆసియా కప్ టోర్నీల్లోనూ ఫ్లాప్ అవుతున్నాడు. గత ఏడాది టీ20 ఆసియా కప్‌లో ఫ్లాప్ షో ఇచ్చిన రోహిత్, వన్డే ఫార్మాట్‌లో పాక్‌తో మ్యాచ్‌లోనూ 11 పరుగులకే అవుట్ అయ్యాడు..
29
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు. గత నాలుగు మ్యాచుల్లోనూ పాకిస్తాన్‌పై టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీయే. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించాడు విరాట్ కోహ్లీ..
39
అలాంటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి అంతకుమించిన ఇన్నింగ్స్ ఆశిస్తారు అభిమానులు. అంచనాలు పెరిగిపోతాయి. అలాగే విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటుంది పాకిస్తాన్. ఆసియా కప్ 2023లో మొదటి మ్యాచ్‌లో ఇదే జరిగింది..
49
Rohit Sharma Bowled
విరాట్ కోహ్లీ 4 పరుగులకే అయ్యాడు. అయినా ప్రతీసారీ విరాట్ కోహ్లీయే కొట్టాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ త్వరగా అవుటైనా భారీ స్కోరు చేయగలిగే ప్లేయర్లు ఉన్నప్పుడే, అది ఛాంపియన్ టీమ్ అవుతుంది.
59
ఐపీఎల్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో 5 సెంచరీలు చేసి, సుప్రీం ఫామ్‌ని చూపించిన శుబ్‌మన్ గిల్, సింగిల్ తీయడానికి 9 బంతులు వాడుకున్నాడు. 32 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
69
Shubman Gill
టీమిండియా టాపార్డర్‌లో రోహిత్, విరాట్, శుబ్‌మన్ గిల్ ముగ్గురూ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆసియా కప్ చరిత్రలో భారత టాప్ 3 ఇలా క్లీన్ బౌల్డ్ కావడం ఇదే తొలిసారి. వన్డేల్లో విరాట్, రోహిత్ ఇద్దరికీ క్లీన్ బౌల్డ్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా షాహీన్ ఆఫ్రిదీ రికార్డు క్రియేట్ చేశాడు..
79
టీమిండియా బ్యాటర్లకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వీక్‌నెస్ చాలా ఏళ్లుగా ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మహ్మద్ ఆమీర్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ట్రెంట్ బౌల్ట్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో షాహీన్ ఆఫ్రిదీ.. టీమిండియా టాపార్డర్‌ని కకావికలం చేశారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది..
89
జహీర్ ఖాన్ తర్వాత చాలా ఏళ్లుగా భారత బౌలింగ్ యూనిట్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడు. అర్ష్‌దీప్ సింగ్‌ని కొన్నాళ్లు వాడిన టీమిండియా, అతన్ని టీ20లకే పరిమితం చేసింది. ఇది ఇలా కొనసాగినంత కాలం టీమిండియాకి ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వీక్‌నెస్ పోదు..
99
ఆసియా కప్ 2023 టోర్నీలో మొదటి మ్యాచ్‌లో మనోళ్ల బ్యాటింగ్ చూశాక, టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. ప్రెషర్ ఫేస్ చేయలేని ప్లేయర్లు, ఎంతటి స్టార్లు అయినా ఐసీసీ టైటిల్ గెలవడం అయ్యే పని కాదు..