IND vs AUS: అలా అంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. నేను దానిమీదే హార్డ్ వర్క్ చేస్తున్నా: కేఎల్ రాహుల్

Published : Sep 19, 2022, 07:52 PM IST

IND vs AUS T20I: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ తర్వాత జాతీయ జట్టులోకి వస్తూ పోతూ ఉన్నా అతడి ఫామ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఆసియా కప్ లో అతడి ఆట టెస్టు కంటే అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. 

PREV
16
IND vs AUS: అలా అంటే ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. నేను దానిమీదే హార్డ్ వర్క్ చేస్తున్నా: కేఎల్ రాహుల్
Image credit: Getty

ఐపీఎల్ లో ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే టీమిండియా ఓపెనర్ రాహుల్.. ఆసియా కప్ లో క్రీజులో నిల్చొనేందుకే ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా అతడి స్ట్రైక్ రేట్ మీద  తీవ్ర విమర్శలు వచ్చాయి.  పవర్ ప్లే లో ఒకవైపు రోహిత్ శర్మ రెచ్చిపోతుంటే రాహుల్ మాత్రం మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కున్నాడు. 
 

26

ఆసియా కప్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన రాహుల్ స్ట్రైక్ రేట్ 122.22గా ఉంది. అయితే దీనిపై రాహుల్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  తానొక్కడే ఆ సమస్యను ఎదుర్కోవడం లేదని.. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ప్రతీ ఆటగాడు ఏదో ఒక  ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. 

36

ఆస్ట్రేలియాతో మొహాలీలో తొలి టీ20కి ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ మాట్లాడుతూ.. ‘దాని (స్ట్రైక్ రేట్)  మీద ప్రతిఒక్కరూ  పనిచేయాల్సిన విషయం. ఈ విషయంలో ఎవరూ పరిపూర్ణులు కాదు. డ్రెస్సింగ్ రూమ్ లోని ప్రతీ ఒక్కరూ  ఏదో ఒక సమస్యతో ఉండే ఉంటారు. అయితే స్ట్రైక్ రేట్ అనేది కొన్ని మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకుని గణించేది కాదు.. 
 

46

ఒక బ్యాటర్ ఎప్పుడూ ఒకే స్ట్రైక్ రేట్ తో ఆడటం కష్టం. ఒక ఆటగాడు 200 స్ట్రైక్ రేట్ తో ఆడాలా..? లేక 100-120 తో ఆడాలా..? అనేది ఎప్పుడూ విశ్లేషించడం కుదరదు. మొత్తంగా చూసుకుంటే స్ట్రైక్ రేట్ ఎలా ఉందనేది ముఖ్యం. 

56

అయినా సరే.. నేను నా స్ట్రైక్ రేట్ మీద పని చేస్తూనే ఉన్నా. టీ20 ప్రపంచకప్ కోసం గత 10-12 నెలలుగా జట్టులో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంది. అందుకోసమే అందరూ కృషి చేస్తున్నారు.  జట్టు తమ నుంచి ఏం కోరుకుంటుందనేదానిపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది.  అలాగే నేను కూడా జట్టుకు ఏ విధంగా ఉపయోగపడాలన్న దానిమీద.. నన్ను నేను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా..’ అని తెలిపాడు. 

66

ఆసియా కప్ లో రాహుల్ అనుకున్న రీతిలో రాణించకపోయినా టీ20లలో అతడి స్ట్రైక్ రేట్ ఫర్వాలేదు. 61 మ్యాచ్ లలో రాహుల్ స్ట్రైక్ రేట్  140 ప్లస్ గానే ఉంది. కానీ ఆఖరి పది ఇన్నింగ్స్ లలో మాత్రం అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుండటంతో రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!

Recommended Stories