ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీల కారణంగా 416 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు...
రిషబ్ పంత్ 146 పరుగులు, రవీంద్ర జడేజా 104 పరుగులు చేసి ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత జట్టుకి 416 పరుగుల భారీ స్కోరు అందించారు.. రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది...
27
James Anderson-Steve Smith
‘మేం కూడా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఉన్న పొజిషన్‌లోనే ఉన్నాం. మేం కూడా వాళ్లలాగే నిలబడగలమనే నమ్మకం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాకు కూడా చాలా పని ఉంది.. మాకు కొన్ని భారీ భాగస్వామ్యాలు కావాలి...
37
కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పితే భారత్‌పై తిరిగి ప్రెషర్ పెట్టొచ్చు. మాకున్న బ్యాటింగ్ లైనప్‌తో ఇది సాధ్యమవుతుందనే నమ్ముతున్నాం...
47
కొన్ని వారాలుగా మా ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాగైనా గెలవడమే మా ముందున్న లక్ష్యం. మేం దానికోసమే ప్రయత్నిస్తున్నాం... మేం తొలి రోజు చాలా చక్కగా బౌలింగ్ చేశాం...
57
అయితే రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది. ఎలాంటి భయం లేకుండా చూడచక్కని షాట్స్ ఆడతాడు. అందుకే అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం...
67
అదీకాకుండా మేం కొన్ని క్యాచులను డ్రాప్ చేశాం. కొన్ని ఎడ్జ్‌లు ఫీల్డర్లకు దూరంగా పడ్డాయి. కొన్ని సార్లు టాపార్డర్ బ్యాటర్ల కంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు బౌలింగ్ చేయడమే కష్టంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్...
77
2007 నుంచి 2022 వరకూ వరుసగా 15 ఏళ్ల పాటు ప్రతీ యేటా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తూ వస్తున్నాడు జేమ్స్ అండర్సన్. భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 32వ సారి ఐదేసి వికెట్ల ప్రదర్శన ఇచ్చాడు జిమ్మీ...