జడ్డూ, బుమ్రా లేకుండా ఆస్ట్రేలియాకి... రెండేళ్ల తర్వాత టీమిండియా ఆ హిస్టరీ రిపీట్ చేస్తుందా...

First Published Sep 29, 2022, 4:24 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాకి ఊహించని విధంగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఒంటి చేతుల్లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఇద్దరు కీ ప్లేయర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడనుంది టీమిండియా...

bumrah

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, నెల రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. మొదటి టీ20లో ఆడని బుమ్రా, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లు, హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు...

bumrah

హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించాడు జస్ప్రిత్ బుమ్రా. టీ20 కెరీర్‌లో బుమ్రా 50 పరుగులు సమర్పించడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో బరిలో దిగని బుమ్రా, మిగిలిన సిరీస్‌తో పాటు వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కూడా దూరమయ్యాడు...

అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలో రెండు మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. జడ్డూకి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు కూడా దక్కలేదు...

Umesh Yadav Injury

ఈ వరుస సంఘటనలను 2020-21 ఆస్ట్రేలియా టూర్‌తో పోల్చి చూస్తున్నారు టీమిండియా అభిమానులు. ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టును గాయాలు వెంటాడాయి. మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యారు...

మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కెఎల్ రాహుల్ (ఇందులో రాహుల్ ఒక్కడూ ప్రాక్టీస్ సెషన్స్‌లో) గాయపడ్డారు. స్టార్ ప్లేయర్లు లేకుండా గబ్బాలో నాలుగో టెస్టు ఆడిన టీమిండియా, 32 ఏళ్లుగా ఆసీస్‌కి వరుస విజయాలు అందిస్తున్న బ్రిస్బేన్‌ కోటను కూల్చి చారిత్రక విజయం అందుకుంది...

Rishabh Pant Brisbane Test

మరోసారి జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెడుతున్న భారత జట్టు, అదే ఫీట్ రిపీట్ చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులు...

Image credit: Getty

బ్రిస్బేన్ టెస్టులో భారత జట్టుకి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు పిలుపు నివ్వాలని... రిషబ్ పంత్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టకుండా తుదిజట్టులో ఆడించాలని ఇప్పటి నుంచే డిమాండ్లు చేస్తున్నారు... బుమ్రా గాయం వార్త రాగానే ‘సిరాజ్’ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది... 

click me!