బుమ్రా అవుట్! ఆవేశ్ ఖాన్ ఫెయిల్... ఫామ్‌లో లేని భువీ! టీమిండియాని కాపాడేదెవరు సామీ...

First Published Sep 29, 2022, 3:41 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు మహ్మద్ షమీ. ఆవేశ్ ఖాన్ అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోవడం, భువనేశ్వర్ కుమార్ మునుపటి ఫామ్‌ని అందిపుచ్చుకోలేకపోవడంతో ఆదరాబాదరగా పొట్టి ప్రపంచకప్‌కి ముందు షమీని టీ20 టీమ్‌లోకి పిలిచాడు సెలక్టర్లు...

Mohammed Shami

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపికైన మహ్మద్ షమీ, మొదటి మ్యాచ్‌కి మూడు రోజుల ముందు కరోనా బారిన పడడంతో అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి అవకాశం దక్కింది. షమీ ప్లేస్‌లో మొదటి టీ20 ఆడిన ఉమేశ్ యాదవ్, 2 వికెట్లు తీసి భువీ, హర్షల్ పటేల్ కంటే మంచి పర్పామెన్సే ఇచ్చాడు...

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి దూరమైనా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మహ్మద్ షమీ ఆడతాడని అనుకున్నారు. అయితే షమీ కోలుకోవడంతో తొలి టీ20 మ్యాచ్‌లో కూడా అతనికి అవకాశం దక్కలేదు. తాజాగా రెండో మ్యాచ్ ఆరంభానికి ముందు షమీ కరోనా నుంచి బయటపడ్డాడు...

Rohit Sharma

తనకు కరనా నెగిటివ్ వచ్చిన రిపోర్టును సోషల్ మీడియాలో పంచుకున్నాడు మహ్మద్ షమీ. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. దీంతో బుమ్రా ప్లేస్‌లో అనుభవం ఓ సీనియర్ బౌలర్ అవసరం భారత జట్టుకి బాగా ఉంది...

rohit sharma

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఇక మిగిలింది రెండు టీ20 మ్యాచులే. ఈ రెండింట్లో ఆడినా ఆ తర్వాత అధికారికంగా మరో రెండు వార్మప్ మ్యాచులు, అనధికారికంగా ఇంకో రెండు వార్మప్ మ్యాచులు మాత్రమే ఆడుతుంది భారత జట్టు...

Arshdeep Singh and Deepak Chahar

మహ్మద్ షమీని ఏడాది తర్వాత ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించే సాహసం భారత జట్టు చేస్తుందా? అయినా టీమిండియా దగ్గర మరో ఆప్షన్ కూడా ఏదీ లేదు. షమీ కాదనుకుంటే, గాయంతో ఆరు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్‌ని మిగిలిన మ్యాచుల్లో ఆడించి, మెగా టోర్నీకి సిద్ధం చేయాల్సి ఉంటుంది...

click me!