నేను, కోహ్లీని అలా ట్రోల్ చేయలేదు! ఆ వార్తలను ఖండించిన గౌతమ్ గంభీర్... క్షమాపణలు చెప్పాంటూ...

First Published | Nov 9, 2023, 2:33 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో  టీమిండియా, సౌతాఫ్రికాతో పాటు సెమీస్ చేరిన మూడో జట్టుగా నిలిచింది ఆస్ట్రేలియా. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్వితీయ డబుల్ సెంచరీతో ఆసీస్‌కి విజయాన్ని అందించాడు..

Glenn Maxwell

292 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయినట్టే అనుకున్నారంతా.

అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఊహించని విధంగా  బౌండరీలు బాదుతూ డబుల్ సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..

Latest Videos


128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికి ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ కొనసాగించి... కెరీర్ ది బెస్ట్ వన్డే ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించాడు..

Virat Kohli-Gautam Gambhir-Maxwell

ముజీబ్ వుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 6 బాది మ్యాచ్‌ని ముగించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత విరాట్ కోహ్లీని ఉద్దేశించి, గౌతమ్ గంభీర్ చేసినట్టుగా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..

‘విరాట్ కోహ్లీ 195 పరుగుల వద్ద ఉండి ఉంటే కచ్ఛితంగా సింగిల్స్ తీసుకుంటూ ఎలాగైనా డబుల్ సెంచరీ చేయాలని చూసేవాడు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ హిట్టు కొట్టి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు..’ అంటూ గౌతమ్ గంభీర్ చెప్పినట్టు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి..
 

Kohli and Maxwell

అయితే ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని కొట్టిపారేశాడు గౌతమ్ గంభీర్. ‘ఏంది చెత్త! నేనేం చెప్పినా నేరుగా నిర్మొహమాటంగా చెబుతాను. నేను ఈ వ్యాఖ్యలు చేసినట్టు నిరూపించండి లేదా నిర్మొహమాటంగా క్షమాపణలు చెప్పండి..’ అంటూ ట్వీట్ చేశాడు గంభీర్..
 

click me!