వాళ్లు సెమీస్‌కి వస్తే, ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి స్టేడియం గోడలు పగిలిపోతాయ్.. - సౌరవ్ గంగూలీ

First Published | Nov 9, 2023, 4:53 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వన్ ఆఫ్ ది టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది పాకిస్తాన్. వరల్డ్ నెం.1 వన్డే టీమ్, వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్, వన్డే బౌలర్.. ఇలా టాప్ ప్లేస్‌లో బరిలో దిగిన పాకిస్తాన్, కొన్ని రోజులకే అన్నింటినీ కోల్పోయింది..
 

నెదర్లాండ్స్, శ్రీలంకలపై ఘన విజయాలు అందుకున్న పాకిస్తాన్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఆఖరికి ఆఫ్ఘానిస్తాన్ చేతుల్లోనూ చిత్తుగా ఓడిన పాకిస్తాన్, వర్షం కరుణించడంతో న్యూజిలాండ్‌పై గెలవగలిగింది..
 

India Vs Pakistan

ఈ విజయంతో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ రేసు నడుస్తోంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిచినా, చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని పాకిస్తాన్ చిత్తు చేస్తే... సెమీ ఫైనల్ చేరే ఛాన్సులు ఉంటాయి..

Latest Videos


2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, జింబాబ్వే చేతుల్లో ఓడిన తర్వాత కూడా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ చేతుల్లో చిత్తు కావడంతో లక్కీగా సెమీ ఫైనల్ చేరింది పాకిస్తాన్. సెమీస్‌లో కివీస్‌ని ఓడించి ఫైనల్ కూడా ఆడింది..
 

‘నాక్కూడా పాకిస్తాన్, సెమీ ఫైనల్ చేరాలని ఉంది. ఎందుకంటే ఇండియా - పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో లేదా, ఫైనల్‌లో ఆడితే అంతకంటే పెద్ద మ్యాచ్ ఉండదు...
 

ఇండియా- పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ చూడడానికే జనం ఎగబడ్డారు. అయితే సెమీస్, ఫైనల్ జరిగితే స్టేడియం గోడలు బద్ధలైపోతాయి. వరల్డ్ కప్ చరిత్రలో అంతకంటే పెద్ద మ్యాచ్ ఉండదు..

భారత జట్టు ఆడుతున్న విధానం, భారతీయులందరికీ ఎంతో నచ్చింది. 8 మ్యాచుల్లో 8 జట్లను చిత్తు చేసి ఘన విజయాలు అందుకున్నారు...

ఇక వేయాల్సిన అడుగులు తక్కువే, కానీ వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి.. కప్పు తేవాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..

click me!