రిజర్వు బెంచ్‌లోనే పృథ్వీ షా.. గాయంతో రుతురాజ్ గైక్వాడ్ అవుట్! - టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

Published : Jan 26, 2023, 06:50 PM IST

2023 ఏడాదిలో వరుస విజయాలతో దూసుకుపోతోంది భారత జట్టు. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ తర్వాత సీనియర్లు తప్పుకోవడంతో కుర్రాళ్లతో నిండిన జట్టు, టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది...

PREV
18
రిజర్వు బెంచ్‌లోనే పృథ్వీ షా.. గాయంతో రుతురాజ్ గైక్వాడ్ అవుట్! - టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో జట్టుకి దూరమయ్యాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్, టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 

28

గాయంతో రుతురాజ్ గైక్వాడ్ టీమ్‌కి దూరం కావడం ఇది మూడోసారి. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ మోచేతి గాయం కారణంగానే జట్టు నుంచి తప్పుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు ఈ మహారాష్ట్ర కుర్రాడు..

38
Image credit: PTI

‘శుబ్‌మన్ గిల్‌తో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు. పృథ్వీ షా కొన్నిరోజులు వెయిట్ చేయక తప్పదు. ఇషాన్ కిషన్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. శుబ్‌మన్ గిల్, టీ20ల్లో సరైన ఛాన్సులు దక్కించుకోలేకపోయాడు. కాబట్టి ఈ ఇద్దరికీ ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం...’ అంటూ స్పష్టం చేశాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

48

దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన పర్పామెన్స్ ఇస్తున్న పృథ్వీ షా, టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి ప్రకటించే జట్టులో తన పేరు ఉంటుందని భావించాడు. అయితే పృథ్వీ షాని టీ20లకు సెలక్ట్ చేసిన బీసీసీఐ, టెస్టుల్లో మాత్రం పట్టించుకోలేదు...
 

58
prithvi shaw

ఇప్పుడు హార్ధిక్ పాండ్యా, పృథ్వీ షాకి తుది జట్టులో చోటు ఉండదని స్పష్టం చేయడంతో ఈ ముంబై కుర్రాడు తుదిజట్టులోకి రావాలంటే శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అట్టర్ ఫ్లాప్ అవ్వాలని, లేదా గాయపడాలని కోరుకోవాల్సిందే. లేదంటే పృథ్వీ షా, టీ20 సిరీస్ మొత్తం రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే.. 

68
MS DHONI

ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ కోసం రాంఛీ చేరుకుంది భారత జట్టు. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్న టీమిండియాని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కలిసి పలకరించాడు. ఇషాన్ కిషన్‌తో పాటు హార్ధిక్ పాండ్యా చాలాసేపు మాహీతో డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడాడు...

78
Image credit: PTI

వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో అదరగొడితే టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

88
Image credit: PTI

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముకేశ్ కుమార్

Read more Photos on
click me!

Recommended Stories