INDvsSL: తొలి టీ20లో టీమిండియా విజయం... మ్యాజిక్ చేసిన భారత బౌలర్లు...

First Published Jul 25, 2021, 11:27 PM IST

శ్రీలంకతో టీ20 సిరీస్‌లోనూ టీమిండియాకి శుభారంభం జరిగింది. కొలంబోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 165 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన లంక జట్టు 126 పరుగులకి ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 38 పరుగుల తేడాతో  అద్భుత విజయాన్ని అందుకుంది. 

165 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక జట్టు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే మూడో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా, 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన మినోద్ భనుకను అవుట్ చేశాడు.
undefined
10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వను యజ్వేంద్ర చాహాల్ బౌల్డ్ చేయగా, 23 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన ఆవిష్క ఫెర్నాండోను భువీ పెవిలియన్‌కి పంపాడు.
undefined
50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను చరిత్ అసలంక, బండారా కలిసి 40 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 19 బంతుల్లో 9 పరుగులు చేసిన ఆషెన్ బండారా, పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
undefined
26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన చరిత్ అసలంక, దీపక్ చాహార్ బౌలింగ్‌లో పృథ్వీషాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో హసరంగను డకౌట్ చేశాడు దీపక్ చాహార్..
undefined
ఆ తర్వాతి ఓవర్‌లోనే కరణరత్నేను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేయగా, 13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి ధసున్ శనక, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
undefined
భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహాల్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీయగా భువనేశ్వర్ కుమార్ నాలుగు, దీపక్ చాహార్ రెండువికెట్లు తీశారు.
undefined
click me!