Dewald Brevis
సౌతాఫ్రికా ‘బేబీత ఏబీడీ’గా గుర్తింపు తెచ్చుకున్న డేవాల్డ్ బ్రేవిస్‌ని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. టిమ్ డేవిడ్‌తో పాటు డేవాల్డ్ బ్రేవిస్ కూడా మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు...
Dewald Brevis
రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి భారత క్రికెటర్లు ఆడిన ‘నో లుక్ సిక్సర్’ (సిక్స్ కొట్టిన తర్వాత బంతిని చూడకపోవడం) షాట్‌ని 19 ఏళ్ల వయసులో అత్యంత అద్భుతంగా ఆడి.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు డేవాల్డ్ బ్రేవిస్...
7 మ్యాచుల్లో 142.47 స్ట్రైయిక్ రేటుతో 161 పరుగులు చేసిన డేవాల్డ్ బ్రేవిస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. శ్రీలంకపై సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రేవిస్‌తో కలిసి ఓ సోషల్ మీడియాలో మాట్లాడాడు..
suryakumar
‘నేను కొన్నిసార్లు నిన్ను కాపీ చేయడానికి ప్రయత్నించాను. నువ్వు బ్యాటింగ్ చేసినట్టుగా ఆడాలని చూశా.. నువ్వు నాకు ఆ నో లుక్ షాట్, అదే నో లుక్ సిక్స్ ఎలా కొట్టాలో నేర్పించరా బాబు.. అదొక్కటీ నీ దగ్గర్నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్..
suryakumar
‘మీకు నేర్పడం అంటే అది గౌరవంగా భావిస్తా. మీ దగ్గర్నుంచి ఎన్నో షాట్స్ నేర్చుకోవాలి. ఇక్కడ జోక్ ఏంటంటే నా నో లుక్ షాట్ అలా అడ్డిమారి గుడ్డిగా వచ్చేస్తుందంతే. దానికి టెక్నిక్ ఏమీ లేదు... అది కళ్లు మూసుకుని ఆడేస్తా... ఆడేసి కళ్లు మూసుకుంటా...’ అంటూ నవ్వేశాడు డేవాల్డ్ బ్రేవిస్...
Image credit: Getty
సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ టోర్నీలో టైటాన్స్ తరుపున ఆడిన డేవాల్డ్ బ్రేవిస్, నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. 57 బంతుల్లో 284.21 స్ట్రైయిక్ రేటుతో 162 పరుగులు చేశాడు...
suryakumar
‘నువ్వు ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లో 160 కొట్టేశావు. అదే వన్డేల్లోకి వస్తే 100 బంతులు ఆడావంటే త్రిబుల్ సెంచరీ కొట్టేస్తావు.’ అంటూ ఛమత్కరించాడు సూర్యకుమార్ యాదవ్... దానికి డేవాల్డ్ బ్రేవిస్ కూడా ఫన్నీగానే స్పందించాడు...
‘ఆ రోజు అలా జరిగిపోయింది. దానికోసం స్పెషల్‌గా ప్రాక్టీస్ ఏమీ చేయలేదు. నిజానికి నేను ఎలా ఆడుతున్నానో, ఎంత స్కోరు చేస్తున్నానో కూడా గమనించలేదు.
ఆ మూమెంట్ అలా కలిసి వచ్చిందంతే... ఒకానొక సమయంలో ప్రతీ బాల్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నిస్తానని నాన్ స్ట్రైయికర్‌కి కూడా చెప్పా.. ’ అంటూ చెప్పుకొచ్చాడు డేవాల్డ్ బ్రేవిస్..