తన క్రేజీ సెలబ్రేషన్స్‌కి అర్థం చెప్పిన యజ్వేంద్ర చాహాల్... 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో...

Published : Apr 19, 2022, 12:03 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేసిన యజ్వేంద్ర చాహాల్... మ్యాచ్‌లో ఐదు వికెట్లు పూర్తి చేసుకున్న తర్వాత గ్రౌండ్‌లో కూర్చొన్ని ఫన్నీ సెలబ్రేషన్స్... 

PREV
19
తన క్రేజీ సెలబ్రేషన్స్‌కి అర్థం చెప్పిన యజ్వేంద్ర చాహాల్... 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, కెరీర్ పీక్ పర్ఫామెన్స్‌తో చెలరేగిపోతున్నాడు. 6 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, 10.35 యావరేజ్‌తో వికెట్లు తీసి అదరగొట్టాడు.

29

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్లు తీశాడు...

39

కేకేఆర్ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 40 పరుగులు కావాల్సిన దశలో 17వ ఓవర్ వేసిన యజ్వేంద్ర చాహాల్... మొదటి బంతికే వెంకటేశ్ అయ్యర్‌ని స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి సింగిల్ రాగా... ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లింది...

49

నాలుగో బంతికి శ్రేయాస్ అయ్యర్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాతి బంతికి శివమ్ మావిని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆఖరి బంతికి ప్యాట్ కమ్మిన్స్‌ కూడా సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కావడంతో యజ్వేంద్ర చాహాల్‌కి హ్యాట్రిక్ దక్కింది...
 

59

మొత్తంగా మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, క్రీజులో దర్జాగా కూర్చొని ఫన్నీగా స్టిల్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఫోజ్ సెలబ్రేషన్ గురించి వివరణ ఇచ్చాడు యజ్వేంద్ర చాహాల్...

69

‘అదో పాత మీమ్... 2019 వన్డే వరల్డ్ కప్‌లో నేను బౌండరీ దగ్గర అలా కూర్చొన్ని మ్యాచ్ చూశాను. ఆ మ్యాచ్ నేను ఆడలేదు. అయితే ఆ మీమ్ చాలా పాపులర్ అయ్యింది...

79

అప్పుడు ఏ మ్యాచ్‌లో అయినా ఐదు వికెట్లు తీసినప్పుడు ఆ ఫోజ్‌ని రీక్రియేట్ చేస్తానని అప్పుడు ప్రామిస్ చేశాను. అందుకే ఆ స్టిల్‌తో సెలబ్రేట్ చేసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

89

యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు దక్కి ఉంటే, భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. 

99

వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి యంగ్ స్పిన్నర్లకు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు కల్పించిన బీసీసీఐ సెలక్టర్లు, నాలుగేళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌కి మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే...

click me!

Recommended Stories