IPL2022: మళ్లీ వస్తా.. తడాఖా చూపిస్తా.. వేలంలో కొనుగోలు కాని ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Apr 02, 2022, 07:27 PM IST

TATA IPL2022: ఐపీఎల్ లో  అత్యధిక వికెట్లు దక్కించుకున్న జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న భారత మాజీ ఆటాడు పీయూష్ చావ్లా.. తాను మళ్లీ లీగ్ ఆడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

PREV
16
IPL2022: మళ్లీ వస్తా.. తడాఖా చూపిస్తా.. వేలంలో కొనుగోలు కాని ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు

భారత మాజీ క్రికెటర్  పీయూష్ చావ్లా తాను మళ్లీ ఐపీఎల్ కు వస్తానంటున్నాడు. ఈ ఏడాది వేలంలో అతడిని ఏ జట్టూ దక్కించుకోలేదు. దీంతో అతడు  ఐపీఎల్ కామెంటరీ చెప్పడానికి వచ్చాడు.  

26

రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అతడు కామెంటేటర్ గా వచ్చాడు. ఈ సందర్భంగా చావ్లా ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. 

36

‘నేను ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా. తర్వాతి  సీజన్లలో మళ్లీ వస్తా. నా వికెట్ల సంఖ్యను  పెంచుకుంటా. వేలంలో  ఎవరూ కొనుగోలు చేయనందుకు బాధగా లేదు.  నా ఆటను మెరుగుపరుచుకోవడానికి ఒక విరామం అనుకుంటా..’ అని వ్యాఖ్యానించాడు. 

46

గతంలో భారత జట్టుకు ఆడి ఐపీఎల్ లో మెరిసి మళ్లీ కామెంటరీ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్లలో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా,  ధవల్ కులకర్ణి, నిఖిల్ చోప్రాలు ఉండగా తాజాగా  ఆ జాబితాలో పీయూష్ చావ్లా కూడా చేరాడు. పైన పేర్కొన్న   మాజీ ఆటగాళ్లంతా ఈ సీజన్ లో కామెంటరీ చెబుతున్నారు. 

56

ఇదిలాఉండగా 33 ఏండ్ల చావ్లా.. 2008 నుంచి 2021 వరకు ఐపీఎల్ ఆడాడు. తన కెరీర్ లో 165 మ్యాచులాడి.. 157 వికెట్లు తీసుకున్నాడు.  ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసున్న ఆటగాళ్లలో చావ్లా నాలుగో స్థానంలో ఉన్నాడు. 

66

ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (171 వికెట్లు), మలింగ (170), అమిత్ మిశ్రా (166) చావ్లా కంటే ముందున్నారు. తన ఐపీఎల్ కెరీర్ లో చావ్లా... చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. 

click me!

Recommended Stories