IPL 2022: కోట్లు పెట్టి కొన్నారు.. కొంతైనా ఆడలే.. తొలివారంలో ఈ ఆటగాళ్లు అట్టర్ ఫ్లాఫ్

Published : Apr 02, 2022, 05:32 PM IST

TATA IPL 2022: గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియతో పాటు ఇటీవలే బెంగళూరులో రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో ఈ ఆటగాళ్లను కోట్లను పోసి  కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.. కానీ..

PREV
17
IPL 2022: కోట్లు పెట్టి కొన్నారు.. కొంతైనా ఆడలే.. తొలివారంలో ఈ ఆటగాళ్లు అట్టర్ ఫ్లాఫ్

గత నెల 26న మొదలైన ఐపీఎల్ వారం గడిచింది. ఇప్పటికే  అన్ని జట్లు ప్రత్యర్థి జట్లతో ఒక మ్యాచ్ ఆడి రెండో మ్యాచ్ కూడా ఆడుతున్నాయి. అయితే  ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియతో పాటు వేలంలో భారీ ఆశలు పెట్టి  ఫ్రాంచైజీలు దక్కించుకున్న  ఆటగాళ్లు మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.  జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ విఫలమైన భారత ఆటగాళ్ల జాబితా (తొలి వారంలో) ఇక్కడ చూద్దాం. 

27

1. రుతురాజ్ గైక్వాడ్ : గతేడాది  ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన ఈ చెన్నై ఓపెనర్ ను ఆ జట్టు తిరిగి రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో డకౌట్ అయిన ఈ ఓపెనర్.. లక్నోతో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా నాలుగు బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. 

37

2. శుభమన్ గిల్ :  రిటెన్షన్ ప్రక్రియలో గుజరాత్ టైటాన్స్ రూ. 8 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆటగాడు శుభమన్ గిల్. అతడిపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ  లక్నతో జరిగిన తొలి మ్యాచ్ లో అతడు  డకౌట్ అయి నిరాశపరిచాడు. 

47

3. మనీష్ పాండే : గతంలో ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన ఈ బ్యాటర్ ను వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.  రూ. 4.6 కోట్లు పెట్టి  తీసుకున్న  పాండే... రెండు మ్యాచులలో కలిపి 11 పరుగులు (6, 5 ) మాత్రమే చేయగలిగాడు.  తర్వాత మ్యాచులో అతడు ఆడేది అనుమానమే. 

57

4. విజయ్ శంకర్ :  శంకర్ కూడా గతంలో ఎస్ఆర్హెచ్ కు ఆడిన వాడే.  ఈ వేలంలో గుజరాత్ అతడిని రూ. 1.40 కోట్లతో దక్కించుకుంది.  లక్నోతో మ్యాచులో 5 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ లో 48 మ్యాచులాడిన శంకర్.. 25.57 సగటుతో 716 పరుగులు  సాధించాడు. 

67

5. వెంకటేశ్ అయ్యర్ : కేకేఆర్ తరఫున ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్  కూడా రిటెన్షన్ లో రూ. 8 కోట్లు దక్కించుకున్నాడు. సీఎస్కేతో మ్యాచులో 16 పరుగులే చేసిన ఈ యువ ఆల్ రౌండర్ తర్వాత రెండు మ్యాచులలో కూడా 10, 3  రన్స్ చేసి ఔటయ్యాడు. 
 

77

6.  రాజ్ బవ : అండర్-19 ప్రపంచకప్-2022 లో భారత్ తరఫున అదరగొట్టిన ఈ కుర్రాడి ప్రదర్శన చూసి ముచ్చటపడిన పంజాబ్ వేలంలో అతడిని రూ. 2 కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే  ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో డకౌట్ అయిన బవ..  కేకేఆర్ తో జరిగిన రెండో మ్యాచులో  11 పరుగులే సాధించాడు. 

click me!

Recommended Stories