Purple Cap Holder Yuzvendra Chahal: ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసినవారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్న యుజ్వేంద్ర చాహల్.. ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నది. ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచి టేబుల్ టాపర్లుగా నిలిచిన సంజూ శాంసన్ సేన.. ప్రస్తుతం ఐపీఎల్ లో స్ట్రాంగ్ టీమ్ లలో ఒకటి.
28
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో రాణిస్తున్న శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ లో కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్. ఎనిమిదేండ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి ఈ సీజన్ లో రాజస్థాన్ కు మారాడు.
38
ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ అతడిని ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం దేశంలో అతడు అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ అని కీర్తించాడు.
48
శాంసన్ మాట్లాడుతూ.. ‘చాహల్ కు ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచి 20వ ఓవర్ దాకా ఎప్పుడైనా బంతిని ఇవ్వొచ్చు. కెప్టెన్ నమ్మకాన్ని అతడు ఎప్పుడూ వమ్ము చేయడు. ఇటీవల కాలంలో భారత్ లో అలాంటి లెగ్ స్పిన్నర్ ను నేనైతే చూడలేదు.
58
చాహల్ గొప్ప మ్యాచ్ విన్నర్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా బౌలింగ్ చేయగల సమర్థుడు. చాహల్ బౌలింగ్ తో పాటు అశ్విన్ వేసిన నాలుగు ఓవర్లు కూడా ఈ మ్యాచ్ లో ఎంతో కీలకం...’ అని తెలిపాడు.
68
కాగా లక్నోతో మ్యాచులో అశ్విన్.. నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులే ఇచ్చాడు. వికెట్లేమీ తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేసి లక్నోపై ఒత్తిడి పెంచాడు.
78
ఇక చాహల్ విషయానికొస్తే.. నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులిచ్చినా.. 4 వికెట్లు పడగొట్టాడు. లక్నోలో కీలక ఆటగాళ్లైన క్వింటన్ డికాక్, ఆయుష్ బదోని, చమీరలతో పాటు ధాటిగా ఆడిన కృనాల్ పాండ్యాలను వెనక్కి పంపి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
88
లక్నో-రాజస్థాన్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో.. 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరముండగా.. లక్నో 12 పరుగులే చేసింది. చివరి ఓవర్ వేసిన కుల్దీప్ సేన్.. అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు.