ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత ప్రటిష్టంగా కనిపిస్తున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. 2020 సీజన్‌లో ఆఖరి స్థానంలో, ఐపీఎల్ 2021లో ఏడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్... ఈసారి భారీ అంచనాలతోనే లీగ్‌ను మొదలెట్టింది...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 210 పరుగుల భారీ స్కోరు చేసిన ఆర్ఆర్, 61 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది...
28
ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన మ్యాచులన్నింటిలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లకే విజయాలు దక్కగా... రాజస్థాన్ రాయల్స్, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి గెలుపు రుచి చూసింది...
38
సన్‌రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిలై... ఆల్‌రౌండ్ అట్టర్ ఫ్లాప్ షో ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్‌కి అఖండ విజయం దక్కింది...
48
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్... ఆర్‌ఆర్‌కి మంచి స్కోరు అందించాడు...
58
‘సంజూ శాంసన్ చేసిన 55 పరుగులు, ఇప్పటిదాకా జరిగిన టోర్నీలో బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. భారత బ్యాటింగ్ లైనప్‌లో ప్లేస్ కోసం ఎంత క్లిష్టమైన పోటీ ఉందో అందరికీ తెలిసిందే...
68
ఇప్పటికే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మిగిలిన ప్లేస్‌ల కోసం యువ క్రికెటర్లు నిత్యం పోటీపడాల్సిన పరిస్థితి...
78
ఇషాన్ కిషన్ కూడా తన మొదటి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్... టీమ్‌లో ప్లేస్ కోసం చూస్తున్నారు...
88
సంజూ శాంసన్ కూడా అవకాశం వస్తే అదరగొట్టగల సత్తా టన్నుల్లో ఉన్న కెప్టెన్లలో ఒకడు.. టీమిండియాలో మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్..