పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు మాహీపై గట్టిగా అరిచేశాను... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు..

Published : Apr 10, 2022, 08:19 PM IST

ఎమ్మెస్ ధోనీ... టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్. అపారమైన అనుభవం కారణంగా ఎంతటి అనుభవం ఉన్న కోచ్‌లు అయినా మాహీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాస్త జంకుతారు... అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఓసారి మాహీపై అరిచేశాడట...

PREV
19
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు మాహీపై గట్టిగా అరిచేశాను... టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు..

మహేంద్ర సింగ్ ధోనీకి సలహాలు ఇవ్వడం అంటే నచ్చదని, అడిగితే కానీ ఎలాంటి టిప్స్ ఇవ్వొద్దని తనతో కామెంట్ చేశాడని రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే...

29

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎంతో కూల్‌గా, కామ్‌గా కనిపించే ఎమ్మెస్ ధోనీ, ‘కెప్లెన్ కూల్’గా పేరు తెచ్చుకున్నాడు. ఈ కామ్ నేచర్ కారణంగానే మాహీ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

39
MS Dhoni

క్రికెటర్ కావడానికంటే ముందు ఫుట్‌బాల్ గోల్ కీపర్ కావాలని ఆశపడిన ఎమ్మెస్ ధోనీ, సమయం దొరికినప్పుడల్లా ఫుట్‌బాల్ ఆడుతుంటాడు... 

49

ఐపీఎల్ సమయాల్లోనూ చాలాసార్లు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు ఎమ్మెస్ ధోనీ... ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ముందు కూడా ఇలా ఫుట్‌బాల్ ఆటలో పూర్తిగా నిమగ్నపోయాడట మాహీ...

59

‘మాహీకి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ఇష్టం అనేకంటే ప్రేమ అనొచ్చేమో. అతను ఆడుతుంటూ చూడడానికి కాస్త భయంగా ఉంటుంది...

69

ఎందుకంటే మాహీ గాయపడితే, టీమ్‌లో ఓ కీ ప్లేయర్ దూరమవుతాడు. ఆపియా కప్ ఫైనల్‌కి ముందు పిచ్‌లో చాలా తేమ ఉంది. టాస్‌కి 5 నిమిషాల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు మాహీ...

79

చాలా సార్లు ఆ పిచ్ మీద స్కిడ్ అవ్వడం చూశాను. అంతే! అతను గాయపడతాడేమోనని భయంతో కోపంగా అరిచేశాను. నా జీవితంలో ఎవరి మీద అంతగా అరవలేదు...

89

ఆటలు ఆపుతావా? లేదా! అని మాహీ మీద కోపడ్డాను. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు మాహీ గాయపడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే అంత కోపం వచ్చింది...

99

ఫుట్‌బాల్ నుంచి అతన్ని వేరు చేయడం చాలా కష్టం. అది అసాధ్యం కూడా. అంతలా ఫుట్‌బాల్ ఆటని ఇష్టపడతాడు మాహీ...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Read more Photos on
click me!

Recommended Stories