సంజూ శాంసన్, ఆ ఫీల్డ్ సెట్టింగ్ ఏంటి... ఆ సమయంలో అతనికి బౌలింగ్ ఇవ్వడంపై..

Published : Apr 06, 2022, 08:09 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని ఘనంగా ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్. మొదటి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీపై అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి...  

PREV
17
సంజూ శాంసన్, ఆ ఫీల్డ్ సెట్టింగ్ ఏంటి... ఆ సమయంలో అతనికి బౌలింగ్ ఇవ్వడంపై..

170 పరుగుల లక్ష్యఛేదనలో ఒకానొక దశలో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్‌ల కారణంగా విజయాన్ని 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 
 

27

ఆఖరి 7 ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 82 పరుగులు కావాల్సి రాగా... 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది... రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్‌లో 21 పరుగులు రావడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది...

37

15వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన నవ్‌దీప్ సైనీ 16 పరుగులు ఇచ్చాడు. దీంతో రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో మ్యాచ్ ఆర్‌సీబీవైపు మళ్లింది...

47
sanju samson

‘అప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌కి అశ్విన్ నో బాల్‌తో మంచి ఓపెనింగ్ దక్కింది. ఫ్రీ హిట్‌లో భారీ షాట్ కొట్టిన కార్తీక్, ఆ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు... 

57

ఆ తర్వాతి ఓవర్‌లో యజ్వేంద్ర చాహాల్‌కి బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ అలా చేయలేదు రాయల్స్. పెద్దగా అనుభవం లేని నవ్‌దీప్ సైనీకి బౌలింగ్ ఇచ్చాడు..  అతను 16 పరుగులు ఇచ్చాడు..

67
Sanju Samson

అదీకాకుండా బౌలింగ్‌కి తగ్గట్టుగా ఆర్ఆర్ ఫీల్డింగ్‌లో సెట్ చేయలేదు. ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ని పెట్టలేదు, థర్డ్ మ్యాన్ ఫీల్డర్ లేడు. దినేశ్ కార్తీక్‌కి చాలా దేశవాళీ టోర్నీలు ఆడిన అనుభవం ఉంది.

77

సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌ని చూసే ఉంటాడు. అతనికి డీప్ ఫీల్డర్లను సెట్ చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సంజూ శాంసన్ దీనికి సమాధానం చెప్పాలి...’ అంటూ కామెంట్ చేశారు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి...

click me!

Recommended Stories