అతను, ఎమ్మెస్ ధోనీకి తక్కువేమీ కాదు... దినేశ్ కార్తీక్‌పై ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్...

Published : Apr 06, 2022, 06:20 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. గత సీజన్లలో కేకేఆర్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక, ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున బరిలో దిగుతూ మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు...

PREV
17
అతను, ఎమ్మెస్ ధోనీకి తక్కువేమీ కాదు... దినేశ్ కార్తీక్‌పై ఫాఫ్ డుప్లిసిస్ కామెంట్...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు దినేశ్ కార్తీక్... అయితే ఆర్‌సీబీకి విజయం మాత్రం దక్కలేదు...

27

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 129  పరుగుల లక్ష్యఛేదనలో 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్‌సీబీ. 7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీకి విజయాన్ని అందించాడు..

37

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగుల టార్గెట్‌ ఛేదనలో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. ఈ దశలో 23 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీకి రెండో విజయాన్ని అందించాడు...

47

రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన దినేశ్ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఫాఫ్ డుప్లిసిస్...

57

‘ఎమ్మెస్ ధోనీ, దినేశ్ కార్తీక్  మధ్య చాలా పోలీకలు ఉన్నాయి. కచ్ఛితంగా ఎమ్మెస్ ధోనీ, వరల్డ్‌లో బెస్ట్ ఫినిషర్. కానీ ఈ ఏడాది దినేశ్ కార్తీక్ ఆటను చూస్తుంటే, అతను ధోనీకి తక్కువేమీ కాదనిపిస్తోంది...

67

దినేశ్ కార్తీక్‌లో ఇంకా చాలా టాలెంట్ ఉంది. అతనికి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచులు ఆడే ఛాన్స్‌లు ఇస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ నయా సారథి ఫాఫ్ డుప్లిసిస్... 
 

77

2019 వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

Read more Photos on
click me!

Recommended Stories