IPL 2022: తప్పు నాదే.. నా వల్లే ముంబైకి ఓటములు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్ శర్మ

Published : Apr 10, 2022, 11:30 AM ISTUpdated : Apr 10, 2022, 11:32 AM IST

TATA IPL 2022: ఐపీఎల్ లో వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ముంబై ఇండియన్స్. అయితే ఈ ఓటములకు కారణం తనేనని తప్పునంతా తనమీదే వేసుకున్నాడు రోహిత్ శర్మ. 

PREV
18
IPL 2022: తప్పు నాదే.. నా వల్లే ముంబైకి ఓటములు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్ శర్మ
Rohit Sharma

ఐదు సార్లు ఛాంపియన్స్ అనే ట్యాగ్ తో  ఐపీఎల్-2022 బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు.  నాలుగు మ్యాచులాడిన రోహిత్ సేన.. నాలుగింటిలో ఓడి  ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. 

28

అయితే జట్టు ఓటమికి ఏ కెప్టెన్ అయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను కారణంగా చూపెడతాడు.  కానీ ముంబై సారథి  రోహిత్ శర్మ మాత్రం ఓటములకు తప్పు తనదే అని చెప్పాడు. 

38

రాయల్ ఛాలెంజర్స్ తో శనివారం పూణేలో జరిగిన  మ్యాచులో ఓటమి అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడుతూ... ‘ఈ పిచ్ గురించి మా అంచనా తప్పింది.  మా బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో తెలిసింది. దానిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 

48

మా జట్టు తరఫున ఆడాల్సిన పలువురు విదేశీ ఆటగాళ్లు ఇంకా జట్టుతో చేరలేదు.  ఇక ఇవాళ్టి మ్యాచ్ లో నేను 26 పరుగులు మాత్రమే చేశాను. అదిా ఏమాత్రం సరిపోదు.నేను వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనుకుంటున్నాను. 

58

కానీ దురదృష్టవశాత్తు.. ఓ చెత్త షాడి వెనుదిరిగాను. తొలి  వికెట్ కు 50 పరుగులు జోడించిన తర్వాత నేను ఔట్ అయి ఉండకూడదు. రాంగ్ టైమ్ లో ఔటయ్యాను. అది కచ్చితంగా మాకు బాధ కలిగించే అంశం. 

68

ఈ పిచ్ పై 150 అనేది కచ్చితంగా తక్కువ  స్కోరు.  అయితే ఆ మాత్రం స్కోరైనా మేము చేయగలిగామంటే దానికి  సూర్యకుమార్ యాదవే కారణం.  సూర్య అద్భుతంగా ఆడాడు.  కాస్త తెలివిగా బ్యాటింగ్ చేస్తే... మీరు  ఎక్కువ సేపు క్రీజులో ఉండి  పరుగులు రాబట్టొచ్చని సూర్య నిరూపించాడు.   ఈ స్కోరు క్రెడిట్ అతడికే చెందుతుంది. 

78
Suryakumar Yadav

అయితే మేం బౌలింగ్  తో కాస్త ఒత్తిడి పెంచాలనుకున్నాం. కానీ మాకు దానిని కాపాడుకునే స్కోరు లేదు. మాకున్న అవకాశాల మేరకు మేము వంద శాతం ప్రయత్నించాం. కానీ వాళ్లు (ఆర్సీబీ) తెలివిగా బ్యాటింగ్ చేశారు...’ అని అన్నాడు. 

88

శనివారం నాటి మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితమైంది. సూర్య (68 నాటౌట్) ఒక్కడే రాణించాడు. ఇక మోస్తారు లక్ష్య ఛేదనలో  ఆర్సీబీ.. 18.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అనూజ్ రావత్ (66), విరాట్ కోహ్లి (48) లు రాణించారు. ఇది ముంబైకి వరుసగా నాలుగో ఓటమి కాగా.. ఆర్సీబీకి వరుసగా మూడో విజయం 

click me!

Recommended Stories