మాహీ ముందుగానే దీన్ని ఊహించాడా? ఐపీఎల్ 2020 సీజన్ అనుభవంతో జడ్డూని ఇరికించి...

Published : Apr 09, 2022, 07:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

PREV
112
మాహీ ముందుగానే దీన్ని ఊహించాడా? ఐపీఎల్ 2020 సీజన్ అనుభవంతో జడ్డూని ఇరికించి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా, మొదటి నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభవాలను అందుకున్నాడు...

212

ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు రవీంద్ర జడేజా... ఇంతకుముందు ఏ భారత కెప్టెన్ కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడలేదు...

312

ప్రతీ ఫ్రాంఛైజీకి రెండు పాయింట్లు ఇచ్చే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుందంటే చెన్నై బౌలింగ్ ఎంత బలహీనంగా తయారయ్యిందో అర్థమవుతోంది...

412

ఐపీఎల్ 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం బట్టి చూస్తుంటే... టీమ్ సెలక్షన్‌పై సంతృప్తి చెందని మాహీ, ఈ రిజల్ట్ ముందే ఊహించి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది...

512

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదటి రోజు కేవలం 4 ప్లేయర్లను కొనుగోలు చేసింది సీఎస్‌కే. దీపక్ చాహార్ కోసం రూ.14 కోట్లు ఖర్చు పెట్టిన సీఎస్‌కే, శార్దూల్ ఠాకూర్, డుప్లిసిస్ వంటి మ్యాచ్ విన్నర్లని దూరం చేసుకుంది...

612

అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, రాబిన్ ఊతప్ప, బ్రావో వంటి పాత ప్లేయర్లను అట్టిపెట్టుకుని, వారిని ఆడించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీఎస్‌కే, ఎన్ జగదీశన్, రాజవర్థన్ హంగర్కేర్ వంటి యంగ్ ప్లేయర్లను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతోంది.

712

ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ ఇలాగే సాగింది సీఎస్‌కే ఆటతీరు. సీనియర్లను నమ్ముకుని వరుస మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది చెన్నై. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం ఇచ్చి, ఆఖర్లో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది..

812

2020 సీజన్‌లో సీఎస్‌కే వరుస పరాజయాలతో ఎమ్మెస్ ధోనీ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు సీఎస్‌కే ఫ్యాన్స్ అయితే మాహీ కూతురు జీవా సింగ్‌ని కూడా ట్రోల్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. 

912
Ravindra Jadeja

అందుకే మాహీ మరోసారి అలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక, సీఎస్‌కే ఎంపిక చేసిన టీమ్‌పై నమ్మకం లేక... కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడ్డూని ఇరికించాడని అంటున్నారు కొందరు నెటిజన్లు...

1012

ఎలాగో కెప్టెన్ ఎవరైనా కెప్టెన్సీ చేసేది తానే, మ్యాచ్ గెలిస్తే ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వెళ్తుంది. ఆ విషయం మాహీకి తెలియనిది కాదు. ఓడితే కెప్టెన్ కాదు కాబట్టి కాస్త ట్రోలింగ్ తగ్గుతుందని మాహీ ఈ ఎత్తు వేసి ఉంటాడని విమర్శిస్తున్నారు.

1112

అయితే 2010 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లో ఓడింది. పంజాబ్ కింగ్స్‌పై సూపర్ ఓవర్‌లో ఓడిన సీఎస్‌కే, ఆ తర్వాత ఆర్‌సీబీపై, ముంబై ఇండియన్స్‌పై, రాజస్థాన్ రాయల్స్‌పై వరుస మ్యాచుల్లో ఓడింది...

1212

అయితే ఆ తర్వాత వరుస విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఈసారి జడేజా కెప్టెన్సీలో అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతోందని ఆశిస్తున్నారు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories