రిషబ్ పంత్‌కి ఊహించని షాక్... వరుస ఓటములు చాలవన్నట్టుగా, లక్నోతో మ్యాచ్‌లో...

Published : Apr 08, 2022, 03:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో స్టార్ టీమ్‌లకు ఊహించని షాక్ తగులుతోంది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు వరుస విజయాలు అందుకుంటుంటే టాప్ టీమ్స్ ఒక్క విజయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి...

PREV
18
రిషబ్ పంత్‌కి ఊహించని షాక్... వరుస ఓటములు చాలవన్నట్టుగా, లక్నోతో మ్యాచ్‌లో...

ఐపీఎల్‌లో ఫైవ్ టైం ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఫోర్ టైమ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... 2022 సీజన్‌లో వరుసగా మూడేసి పరాజయాలను అందుకున్నాయి...

28

మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయాన్ని అందుకుని, ఐపీఎల్ 2022 సీజన్‌లో శుభారంభం చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఆ తర్వాత ఢిల్లీకి వరుసగా రెండు మ్యాచుల్లో వరుస పరాజయాలు ఎదురయ్యాయి...

38

రిషబ్ పంత్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కోల్పోయి, కేకేఆర్‌కి మారిన శ్రేయాస్ అయ్యర్ వరుస విజయాలు అందుకుంటుంటే, ఢీసీ మాత్రం గత సీజన్‌ జోరును చూపించలేకపోతోంది.

48

గుజరాత్ టైటాన్స్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ దాకా పోరాడి  6 వికెట్ల తేడాతో ఓడింది...
 

58

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీషా 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేయగా రిషబ్ పంత్ 39, సర్ఫరాజ్ ఖాన్ 36 పరుగులు చేశారు...

68

150 పరుగుల లక్ష్యఛేదనలో 4 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్, ఆఖరి ఓవర్‌లో 2 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది...

78

క్వింటన్ డి కాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 25 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 19, ఆయుష్ బదోనీ 10 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు...

88
Rishabh Pant

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కి రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా కట్టిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్...

Read more Photos on
click me!

Recommended Stories