IPL మ్యాచులపై ‘RRR’ ఎఫెక్ట్... ఐపీఎల్ 2022 సీజన్‌ టీఆర్పీ ఢమాల్, బీసీసీఐకి షాక్ తప్పదా...

Published : Apr 08, 2022, 03:11 PM IST

ఐపీఎల్‌ 2020 సీజన్‌ని క్లిష్ట పరిస్థితుల్లో నిర్వహించి, సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. ఆ తర్వాతి ఏడాది రెండు ఫేజ్‌లుగా సాగిన 2021 సీజన్, అంతకంటే పెద్ద హిట్టైంది. దాంతో అదనంగా రెండు ఫ్రాంఛైజీలను చేర్చి, 10 జట్లతో మెగా లీగ్‌ను తీసుకొచ్చింది భారత క్రికెట్ బోర్డు...

PREV
110
IPL మ్యాచులపై ‘RRR’ ఎఫెక్ట్... ఐపీఎల్ 2022 సీజన్‌ టీఆర్పీ ఢమాల్, బీసీసీఐకి షాక్ తప్పదా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదనంగా చేర్చిన రెండు కొత్త ఫ్రాంఛైజీల ద్వారా భారత క్రికెట్ బోర్డుకి రూ.12 వేలకు పైగా ఆదాయం సమకూరింది... నామినేషన్ రుసుం రూపంలో వచ్చిన ఆదాయం మరో రూ.200 కోట్లపైనే...

210

ఐపీఎల్ 2022 సీజన్‌ని 74 రోజుల పాటు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీసీసీఐ, అందుకు తగ్గట్టుగా వారం ముందుగానే మ్యాచులను ప్రారంభించింది...
 

310

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌ టీఆర్పీ ఏకంగా 33 శాతం పడిపోయింది. అదీకాకుండా వ్యూయర్‌షిప్ శాతం కూడా 14 శాతం తగ్గింది...

410

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు రోజే (మార్చి 25న) ‘RRR’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో భారీ ఎత్తున విడుదలైంది. దీంతో నాలుగైదు రోజుల పాటు హైప్ అంతా ఈ సినిమా చుట్టురా తిరిగింది...

510

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటనతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను రూపొందించిన విధానానికి సినీ ప్రపంచం నుంచి ప్రశంసల వర్షం కురిపించింది..

610

ఐపీఎల్ మ్యాచులు ప్రారంభమయ్యే సాయంకాలం, రాత్రి వేళల్లో థియేటర్ల దగ్గర ’ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ల కోసం క్యూ కట్టారు జనాలు.. 

710
Image Credit: Getty Images

ఈ సినిమా హడావుడి కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైన విషయమే చాలా మంది గుర్తించలేదు. ఆ ఎఫెక్ట్ టీఆర్పీపై తీవ్రంగా పడింది...

810

అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు వరుసగా మూడేసి మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచాయి...

910

మిగిలిన ఫ్రాంఛైజీల మ్యాచులు కూడా చప్పగా సాగుతుండడంతో ఐపీఎల్ టీఆర్పీ పడిపోయింది. ఇకపై సాగే మ్యాచులు ఇంట్రెస్టింగ్‌గా మారితే, ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ వస్తే, టీఆర్పీ మళ్లీ పెరిగే అవకాశం ఉంది...

1010

ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.35-40 వేల కోట్లు ఆర్జించాలని టార్గెట్ పెట్టుకున్న బీసీసీఐకి టీఆర్పీ రూపంలో ఊహించని షాక్ తగిలింది... 

click me!

Recommended Stories