సొంత ఇల్లు కూడా లేదు, ఐపీఎల్ 2022 డబ్బుతో అదే పని చేస్తా... తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ...

Published : Apr 04, 2022, 12:59 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.కోటీ 70 లక్షలకు తిలక్ వర్మను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. మొదటి రెండు మ్యాచుల్లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన తిలక్ వర్మ, జట్టులో తన ప్లేస్‌ దాదాపు ఫిక్స్ చేసుకున్నట్టే కనిపిస్తోంది...

PREV
17
సొంత ఇల్లు కూడా లేదు, ఐపీఎల్ 2022 డబ్బుతో అదే పని చేస్తా... తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మొదటి మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన తిలక్ వర్మ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

27

33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మ, రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

37

అండర్-19 వరల్డ్ కప్ 2020 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు తిలక్ వర్మ.2002, నవంబర్ 8న హైదరాబాద్‌లో జన్మించిన తిలక్ వర్మ వయసు 19 ఏళ్లు. ఆరు అడుగులకు పైగా పొడవుండే ఈ కుర్రాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్... 

47

‘చిన్నతనం నుంచే మా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని చూస్తూ పెరిగా. మా నాన్నకి వచ్చే కాస్త జీతం, నా క్రికెట్ ఖర్చులకి, మా అన్నయ్య చదువులకే సరిపోయేది...

57

ఇప్పటిదాకా మాకు సొంతం ఇల్లు లేదు. ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో మా అమ్మానాన్నల కోసం ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నా... 

67

ఐపీఎల్ వల్ల వచ్చే డబ్బు, ఏ భయం లేకుండా నా క్రికెట కెరీర్ కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు నేను కోచ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నా...

77

నాకు ధర పెరిగే కొద్దీ నా కోచ్ కన్నీళ్లు పెట్టుకోవడం మొదలెట్టాడు. ముంబై ఇండియన్స్ కొన్నాక మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు కూడా ఏడ్చేశారు...’ అంటూ చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ...

click me!

Recommended Stories