రాయల్స్‌కి ఊహించని షాక్... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్...

Published : Apr 06, 2022, 04:46 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై ఇంకా రెండు వారాలు కూడా కాలేదు, అప్పుడే గాయాల బెడద ప్రారంభమైంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ క్రికెటర్ నాథన్ కౌంటర్‌ నైల్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

PREV
17
రాయల్స్‌కి ఊహించని షాక్... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడిన నాథన్ కౌంటర్‌నైల్, 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 48 పరుగులు సమర్పించాడు. అయితే మిగిలిన బౌలర్లు రాణించడంతో సన్‌రైజర్స్ 61 పరుగుల తేడాతో ఓడింది...
 

27

తొలి మ్యాచ్‌లో గాయపడిన నాథన్ కౌంటర్‌నైల్ పూర్తి కోటా బౌలింగ్ వేయకుండానే పెవిలియన్ చేరాడు. మళ్లీ ఫీల్డింగ్‌కి కూడా రాలేదు...

37

రెండో మ్యాచ్‌లో నాథన్ కౌంటర్ నైల్ స్థానంలో భారత పేసర్ నవ్‌దీప్ సైనీకి తుదిజట్టులో చోటు దక్కింది. ముంబై ఇండియన్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచుల్లోనూ బరిలో దిగని నాథన్‌ కౌంటర్ నైల్, గాయం కారణంగా జట్టును వీడుతున్నట్టు ప్రకటించింది రాజస్థాన్ రాయల్స్...

47

2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న నాథన్ కౌంటర్‌నైల్, గత సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున బరిలో దిగాడు. ఆ తర్వాత కేకేఆర్, ఆర్‌సీబీ జట్ల తరుపున ఆడాడు...

57

గాయం కారణంగా ఐపీఎల్ 2017, 2018 సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల నుంచి సీజన్ మధ్యలోనే నిష్కమించిన నాథన్ కౌంటర్ నైల్, మరోసారి రాజస్థాన్ రాయల్స్ తరుపున ఒకే మ్యాచ్ ఆడి జట్టును వీడబోతున్నాడు...

67

మొదటి రెండు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి పరాజయాన్నిచవిచూసింది. కౌంటర్ నైౌల్ స్థానంలో ఏ ప్లేయర్‌ని తీసుకోబోతున్నారనేది రాయల్స్ ఇంకా ప్రకటించలేదు.

77

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌కి ఫారిన్ ప్లేయర్లు తెగ ఇబ్బందిపెట్టారు. జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరం కాగా బెన్ స్టోక్స్, ఒకే మ్యాచ్ ఆడి గాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో పాల్గొనలేదు...

click me!

Recommended Stories