IPL Playoffs: ఎస్ఆర్హెచ్ పై విజయం.. చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు సజీవమేనా..? ఏం చేస్తే వెళ్లొచ్చు..?

Published : May 02, 2022, 12:48 PM IST

TATA IPL 2022: వరుస పరాజయాలు, కెప్టెన్సీ మార్పుతో మానసికంగా దెబ్బతింటుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్  గోడకు కొట్టిన బంతిలా పుంజుకుంది.   హైదరాబాద్ తో ఆదివారం ముగిసిన  మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

PREV
19
IPL Playoffs: ఎస్ఆర్హెచ్ పై విజయం.. చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు సజీవమేనా..? ఏం చేస్తే వెళ్లొచ్చు..?

సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్-15లో ఇది మూడో విజయం. ఇప్పటివరకు 9 మ్యాచులాడిన  ఆ జట్టు.. ఆరు మ్యాచుల్లో పరాజయం పాలైంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై.. ప్లేఆఫ్ రేసులో తాను కూడా ఉన్నానని చెప్పింది. 

29

ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై తర్వాత జరుగబోయే ప్రతి మ్యాచ్ నెగ్గాల్సి ఉంటుంది. ఆ జట్టు తన తర్వాతి మ్యాచులను గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ తో ఆడాల్సి ఉంది. 

39

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చెన్నై..  ఈ ఐదు మ్యాచుల్లో నెగ్గాల్సిందే.  అప్పుడు సీఎస్కేకు 8 విజయాలు.. 16 పాయింట్లు చేకూరుతాయి.  ఈ ఐదు మ్యాచుల్లో  భారీ తేడాతో  ప్రత్యర్థులను ఓడిస్తే ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడుతుంది. 

49

ప్రస్తుతం సీఎస్కే నెట్ రన్ రేట్ మైనస్ (-0.407) గా ఉంది. ఒకవేళ  పైన పేర్కొన్న జట్లతో మ్యాచులన్నీ గెలిచినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉంటే చెన్నైకి  చెక్ పడ్డట్టే. 

59

ఇప్పటికే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ (9 మ్యాచుల్లో 8 విజయాలు 1 పరాజయం.. 16 పాయింట్లు) ప్లేఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నట్టే. తర్వాత స్థానంలో ఉన్న లక్నో (10 మ్యాచుల్లో 7 విజయాలు, 3 ఓటములు, 14 పాయింట్లు) మంచి నెట్ రన్ రేట్ తో ఉన్నాయి. 

69

ఇవే గాక మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ (9 మ్యాచులు, 6 విజయాలు, 3 ఓటములు.. 12 పాయింట్లు) కూడా ప్లేఆఫ్ రేసులో  ముందంజలో ఉంది.  నాలుగో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదు మ్యాచులు గెలిచి తర్వాత  మళ్లీ వరుసగా రెండు ఓటములు మూటగట్టుకుంది. ఆ జట్టుకు 10 పాయింట్లున్నాయి. ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్హెచ్ నిలవాలంటే మరో 3 మ్యాచుల్లో గెలవాలి.  

79

ఈ నాలుగు జట్లే గాక  ఆర్సీబీ  (పది మ్యాచుల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములు) నుంచి కూడా సీఎస్కేకు ముప్పు ఉంది. ఐదు మ్యాచులు గెలవడమే గాక ఈ ఐదు జట్ల విజయాలు, అపజయాలు కూడా చెన్నైని ప్రభావితం చేస్తాయి.

89

వీటన్నింటింని దాటుకుని చెన్నై ముందుకెళ్లడం కష్టమే అయినా ధోని మీద భారం వేసిన సీఎస్కే.. అతడే తమను  ప్లేఆఫ్ రేసులో నిలుపుతాడని భావిస్తున్నది. 

99

మరి  ఈ సీజన్ కు ముందు రవీంద్ర జడేజా కు  సారథ్య బాధ్యతలు అప్పజెప్పి తిరిగి  ఆ ఒత్తిడి తన వల్ల కాదంటే మళ్లీ  ఆ స్థానంలోకి వచ్చి చెన్నైకి విజయం అందించిన  మహేంద్రుడు.. చెన్నైని తీరానికి చేరుస్తాడా..? లేక చేతులెత్తేస్తాడా అన్నది మరో రెండు మ్యాచుల తర్వాత తేలుతుంది. 

click me!

Recommended Stories