T20 worldcup 2021: ఫామ్‌లో ఉన్న అతన్ని ఆడించకపోవడమే...ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి...

First Published Oct 24, 2021, 9:48 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం. అయితే ఈ ఇద్దరూ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాకి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రోహిత్ శర్మ, తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు... 

ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్, పాక్‌పై కేవలం 14 సగటుతో పరుగులు చేయడం విశేషం...

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించబోయే రోహిత్, పొట్టి ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ రికార్డు కూడా లేదు.

రోహిత్ శర్మ విషయం పక్కనబెడితే, ఐపీఎల్‌లో అదరగొట్టిన కెఎల్ రాహుల్ కూడా 3 పరుగులకే అవుట్ కావడం ఫ్యాన్స్‌కి మరింత కోపాన్ని కలిగించింది. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్రెండింగ్‌లో కనిపించింది... 

ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది విశ్వరూపం చూపించాడు..

ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు ఇషాన్ కిషన్... వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది...

ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ కంటే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు కల్పించింది టీమిండియా...

వస్తూనే ఓ సిక్సర్, ఫోర్ బాది మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించిన సూర్యకుమార్ యాదవ్, 8 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

హార్ధిక్ పాండ్యా ఫామ్‌, ఫిట్‌నెస్‌పైన కూడా అనుమానాలు ఉన్నాయి. పాండ్యా బౌలింగ్ వేసేందుకు సరిపడా ఫిట్‌గా లేడని భారత జట్టు కూడా ప్రకటించింది. 

అలాంటి సమయంలో హార్ధిక్ పాండ్యాని కొనసాగించే బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కి చోటు ఇవ్వొచ్చు కదా అని అంటున్నారు అభిమానులు...

click me!