వెస్టిండీస్‌కి ఊహించని ఎదురుదెబ్బ... టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ సూపర్ 12లో దక్కని చోటు...

First Published Nov 7, 2021, 8:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగింది వెస్టిండీస్. 2016 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విన్నర్ వెస్టిండీస్, ఈ సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో సూపర్ 12 రౌండ్‌ని ముగించింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయ్యి, దారుణ ఓటమిని చవిచూసిన వెస్టిండీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగిన మ్యాచుల్లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది...

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న వెస్టిండీస్, వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 8 స్థానాల్లో ఉన్న జట్లు, నేరుగా టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి.

ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు... నేరుగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాయి...

టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయిన వెస్టిండీస్‌తో పాటు 9వ స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు కూడా టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో సూపర్ 12 రౌండ్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయాయి...

టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌, వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌లో కూడా నేరుగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది. వన్ టైం టైటిల్ ఛాంపియన్ శ్రీలంక, టూ టైం టైటిల్ విన్నర్ వెస్టిండీస్ జట్లు గ్రూప్ స్టేజ్‌లో పోటీపడనున్నాయి...

2009 తర్వాత 2012, 2014, 2016 సీజన్లలో వరుసగా సెమీస్ చేరిన వెస్టిండీస్, ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా, స్కాట్లాండ్ జట్లు క్వాలిఫైయర్స్‌ రౌండ్‌లో పోటీపడబోతున్నాయి. 

గ్లోబల్ క్వాలిఫైయర్స్‌లో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆఖరి నాలుగు స్థానాల్లో నిలిచిన ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, నెదర్లాండ్స్ జట్టు, అలాగే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కింది స్థానాల్లో ఉన్న నేపాల్, జింబాబ్వే, యూఏఈ, సింగపూర్ జట్లు తలబడతాయి...

అలాగే అమెరికా, ఆఫ్రికాల ఖండాల నుంచి బహ్రెయిన్, హంగ్ కాంగ్, ఫిలిఫ్పిన్స్, జెర్సీ, జర్మనీలతో పాటు మరో మూడు జట్లు కలిసి మొత్తంగా 16 జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్స్‌లో తలబడతాయి... ఈ 16 జట్లలో నుంచి నాలుగు జట్లు, క్వాలిఫైయర్స్ రౌండ్‌కి అర్హత సాధిస్తాయి...

click me!