న్యూజిలాండ్ గెలుస్తుందని ఒక్క ట్వీట్ వేయన్నా ప్లీజ్... గౌతమ్ గంభీర్‌కి అభిమానుల రిక్వెస్ట్...

Published : Nov 06, 2021, 03:43 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగిన భారత జట్టు, ఇప్పుడు అద్భుతాల కోసం ఆశగా ఎదురుచూసే పనిలో పడింది. కాస్తో కూస్తో ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు, పటిష్ట న్యూజిలాండ్ జట్టును ఓడించాల్సి ఉంటుంది...

PREV
113
న్యూజిలాండ్ గెలుస్తుందని ఒక్క ట్వీట్ వేయన్నా ప్లీజ్... గౌతమ్ గంభీర్‌కి అభిమానుల రిక్వెస్ట్...

న్యూజిలాండ్ జట్టును ఓడించడమంటే అంత తేలికైన విషయం కాదు. ఐసీసీ టోర్నీల్లో వరుసగా టీమిండియాను ఓడిస్తున్న న్యూజిలాండ్, గత జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన జోష్‌లో ఉంది...

213

అయితే న్యూజిలాండ్‌కి ఒకే ఒక్క వీక్‌నెస్ స్పిన్... న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన బలం కూడా అదే...

313

ఆఫ్ఘనిస్తాన్‌లో ముజీబ్ వుర్ రహీం, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నాయి. అయితే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 17 ఓవర్లు ముగిసేసరికి 94 పరుగులు మాత్రమే చేసిన కివీస్, ఆఖరి నాలుగు ఓవర్లలో 70+పరుగులు రాబట్టింది...

413

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ కావచ్చు. స్పిన్నర్ల బౌలింగ్‌లో నెమ్మదిగా ఆడి, అవకాశం దొరికినప్పుడు విరుచుకుపడొచ్చు న్యూజిలాండ్. అయినా సరే ఆఫ్ఘాన్‌పై భారీ ఆశలే పెట్టుకున్నారు భారత అభిమానులు...

513

అందుకే న్యూజిలాండ్‌ను ఆపగల శక్తి, ఆ సత్తా ఒక్కరినే ఉందంటూ, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను ఒక్క ట్వీట్ వేయాలంటూ డిమాండ్ చేస్తూ, సోషల్ మీడియాలో విన్నపాలు చేస్తున్నారు...

613

గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని చెబితే, ఆ టీమ్‌ ఓడిపోవాల్సిందే... అని క్రికెట్ ఫ్యాన్స్ నమ్మకం. టీమిండియా విషయంలో కూడా అదే జరిగింది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు తప్పక గెలుస్తుందని, టీమిండియా విజయాన్ని ఏ శక్తి ఆపలేదని ట్వీట్ చేశాడు గంభీర్..

713

ఫలితం 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మంచి ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌ను పొడుగుతూ ఓ ట్వీట్ వేశాడు గంభీర్..

813

దెబ్బకు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు గౌతమ్ గంభీర్. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలాగైనా గెలుస్తుందని గౌతీ ఒక్క ట్వీట్ చేస్తే చాలని, బ్రతిమిలాడుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

913

గౌతమ్ గంభీర్ ట్వీట్ చేస్తే కేన్ విలియంసన్, మార్టిన్ గుప్టిల్, జేమ్స్ నీశమ్, ట్రెంట్ బౌల్ట్ వంటి ఎందరు స్టార్లు ఉన్నా న్యూజిలాండ్‌ ఓడిపోయి తీరాల్సిందేనని ట్విట్టర్ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు..

1013

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ ఇరగదీసి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదుచేసింది...

1113

పసికూన స్కాట్లాండ్ జట్టును 85 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ జెట్ స్పీడ్ ఛేజింగ్ కారణంగా నెట్ రన్‌రేట్‌ మెరుగుపర్చుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది టీమిండియా...

1213

అయితే భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫలితం కీలకం కానుంది. పసికూన ఆఫ్గాన్, న్యూజిలాండ్‌పై ఎలాగైనా విజయం సాధిస్తేనే... భారత జట్టుకి సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి...

1313

న్యూజిలాండ్‌పై ఆఫ్ఘాన్ విజయం సాధిస్తే... న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, టీమిండియా (నమీబియాపై విజయం సాధిస్తే) జట్లు ఆరేసి పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా సాధించే విజయం మార్జిన్, ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫార్మ్ చేస్తుంది...

click me!

Recommended Stories