2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ... భారత జట్టులో సంచలన మార్పులకు నాంది. కెప్టెన్‌గా మహీ శకం మొదలైంది ఇక్కడే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరు సీజన్లు టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించింది ఐసీసీ... మరికొన్ని రోజుల్లో 2021 టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది...
2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి 2021 వరల్డ్‌కప్ దాకా ఏడు సీజన్లలో భారత్‌కి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ...
210
2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈసారి మెగా టోర్నీని మిస్ అవ్వబోతున్నాడు...
310
ప్లేయర్‌గా మిస్ అవుతున్నా, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మాహీ సేవలను వినియోగించుకోవాలని డిసైడ్ అయిన బీసీసీఐ, ధోనీని మెంటర్‌గా నియమించిన విషయం తెలిసిందే..
410
2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 4 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, మూడు ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీతో 88 పరుగులు చేశాడు...
510
2009 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 5 మ్యాచులు ఆడిన రోహిత్, 32.75 సగటుతో 122.4 స్ట్రైయిక్ రేటుతో ఓ హాఫ్ సెంచరీతో 131 పరుగులు చేశాడు...
610
2010 టీ2 వరల్డ్‌కప్‌లో 3 మ్యాచులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ, ఓ మ్యాచ్‌లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓదాంట్లో రోహిత్‌కి బ్యాటింగ్ రాకపోగా, మరోదాంట్లో 5 పరుగులు చేసి నిరాశపరిచాడు...
710
2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 5 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 41 సగటుతో 82 పరుగులు చేశాడు. మరీ అద్భుతమైన ప్రదర్శన చేయకపోయినా, కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు...
810
2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 6 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 40 సగటుతో 200 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
910
2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 17.60 సగటుతో 88 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...
1010
2021 టోర్నీ, రోహిత్ శర్మ ఖాతాలో ఏడో టీ20 వరల్డ్‌కప్ కానుంది. ఇంతకుముందు టోర్నీలతో పోలిస్తే ఈసారి ‘హిట్‌మ్యాన్’ రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది భారత జట్టు...