ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, ఏబీ డివిల్లియర్స్... తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌కి దూరమైన స్టార్లు వీరే...

First Published Sep 13, 2021, 10:10 AM IST

టీ20 వరల్డ్‌కప్‌కి అతి తక్కువ కాలంలోనే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ పొట్టి వరల్డ్‌కప్, ఏడో సీజన్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు జరగగా ఈసారి కొందరు స్టార్లు ఆడలేకపోతున్నారు...

ఏబీ డివిల్లియర్స్: ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ సౌతాఫ్రికా క్రికెట్ సూపర్‌స్టార్, తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌లో కనిపించడం లేదు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1 సమయంలో ఏబీ డివిల్లియర్స్, టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగినా, ఏబీడీ ఆ వార్తలను కొట్టిపారేశాడు...

ఎమ్మెస్ ధోనీ: ఎలాంటి అంచనాలు లేకుండా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన టీమిండియా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో అందరి అంచనాలకు తలకిందులు చేసే పర్ఫామెన్స్‌తో టైటిల్ గెలిచింది...

టీ20 వరల్డ్‌కప్‌లో గత ఆరు టోర్నీలకు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఎమ్మెస్ ధోనీ, ఈసారి ప్లేయర్‌గా మిస్ అవుతున్నా... మెంటర్‌గా ప్రత్యేక్షం కానున్నాడు...

యువరాజ్ సింగ్: 2007 టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఎమ్మెస్ ధోనీ కంటే యువీ పర్ఫామెన్సే ప్రధాన కారణం. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ, తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌కి దూరమయ్యాడు.

షేన్ వాట్సన్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ గత ఆరు టీ20 వరల్డ్‌కప్‌లలో పాల్గొన్నాడు.. గత ఏడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వాట్సన్, తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ని మిస్ అవుతున్నాడు...

దిల్షాన్: శ్రీలంక తరుపున టీ20ల్లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్, తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉంటున్నాడు...

షాహిదీ ఆఫ్రిదీ: పాక్ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలాసార్లు జరిగింది. ఇంకా టీ20 లీగుల్లో కొనసాగుతున్న ఆఫ్రిదీ, తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉన్నాడు. 

షోయబ్ మాలిక్: అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్లలో పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఒకడు. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కి 2009 టీ20 వరల్డ్‌కప్ అందించిన షోయబ్ మాలిక్, ఈ ఏడాది పాక్ జట్టులో చోటు దక్కలేదు...

జేపీ డుమినీ: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమినీ, 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ప్లేయర్‌గా దూరమైనా డుమినీ, సౌతాఫ్రికా జట్టుకి కన్సల్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు...

తమీమ్ ఇక్బాల్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ తమీమ్ ఇక్బాల్‌కి టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో చోటు దక్కలేదు. ఆరు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడిన ఇక్బాల్, తొలిసారి ఈ టోర్నీకి దూరం కానున్నాడు..

రాస్ టేలర్: న్యూజిలాండ్ తరుపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రాస్ టేలర్‌కి, టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చోటు దక్కలేదు...

ముషరఫే మొర్తాజా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మొర్తాజా, గత ఆరు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలలో పాల్గొన్నాడు. అయితే కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతూ, సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న మొర్తాజాకి టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కలేదు...

click me!