ఆరెంజ్ క్యాప్ రాదనా, లేక అమ్మాయి అడిగిందనా... కెఎల్ రాహుల్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

Published : Oct 24, 2021, 11:33 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఘోరంగా ఫెయిల్ కావడం, టీమిండియా స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. 6 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ ఫెయిల్ కావడంతో కోహ్లీ, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ నిర్మించేందుకు నెమ్మదిగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది...

PREV
17
ఆరెంజ్ క్యాప్ రాదనా, లేక అమ్మాయి అడిగిందనా... కెఎల్ రాహుల్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు కెఎల్ రాహుల్... గత సీజన్‌లో 670+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లోనూ 620+ పరుగులు చేసి అదరగొట్టాడు...

27

టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలో కెఎల్ రాహుల్‌ అదరగొడతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పాక్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 8 బంతులాడిన కెఎల్ రాహుల్, 3 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. 

37

దీంతో కెఎల్ రాహుల్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. ఐపీఎల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించే కెఎల్ రాహుల్ తన జట్టుకి విజయాలు అందించకపోయినా, ఆరెంజ్ క్యాప్ కోసమే ఆడుతున్నట్టుగా క్రీజులో కుదురుకుపోయి ఆడతాడు...

47

అలాంటి క్లాస్ ప్లేయర్ కెఎల్ రాహుల్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంత త్వరగా అవుట్ కావడం అభిమానులకు కోపం తెప్పించింది. ఆరెంజ్ క్యాప్ రాదనే ఉద్దేశంతోనే రాహుల్ త్వరగా అవుటై ఉన్నట్టున్నాడని తీవ్రంగా ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు...

57

మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు ఓ పాక్ మహిళా విలేకరి, కెఎల్ రాహుల్‌ను త్వరగా అవుటై పోవాలంటూ కోరింది...

67

‘రాహుల్, ఈ రోజు బాగా ఆడకు ప్లీజ్... ’ అంటూ అమ్మాయి అరుస్తూ అడిగిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో అమ్మాయి అడిగిందనే ఉద్దేశంతో త్వరగా అవుటై, ఆమె కోరిక తీర్చి ఉంటాడని ట్రోల్స్ చేస్తున్నారు...

77

ఇప్పటిదాకా టీమిండియా ఓడిపోతే, కేవలం విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మాత్రమే ట్రోలింగ్ ఎదుర్కునేవాళ్లు. ఇప్పుడు కెఎల్ రాహుల్‌, రోహిత్ శర్మలతో పాటు హార్ధిక్ పాండ్యా, జడేజా అండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత స్టార్ బౌలర్లు కూడా ఈ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది...

click me!

Recommended Stories